Tollywood Producer : మంచు మనోజ్ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా బైరవం.. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో జోరును పెంచారు. నిన్న సాయంత్రం హైదరాబాదులో గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో సహా సినీ ప్రముఖులు అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ మంచు మనోజ్ పై ప్రశంసలు కురిపించారు.. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీ మధ్య జరుగుతున్న వివాదాలు గురించి క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు పై ఆయన ఎప్పుడూ కుట్రలు చేయలేదని.. ఇది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలంటూ అన్నారు.. అంతేకాదు మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. అంతేకాదు ముంగిస పాము స్టోరీ చెప్పి అందరికి కనువిప్పు కలిగించాడు. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. మరి దీనిపై మంచి మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి..
మంచు మనోజ్ పై ప్రశంసలు కురిపించిన నిర్మాత..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లం కొండ సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఈయన ఎన్నో సినిమాలను నిర్మించాడు. ఈయన నిర్మాణంలో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. తాజాగా మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం చిత్రం మే 30న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాధా మోహన్ నిర్మించారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెరిశారు. ఇందులో భాగంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మంచు ఫ్యామిలీలో వినిపిస్తున్న విభేదాల గురించి ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మోహన్ బాబు ఇంట్లో నేను మేనేజర్ గా పని చేశాను.. నా చాలా మంచివారు అంటూ మోహన్ బాబు పై ప్రశంసలు.. అప్పట్లో ఫిలింనగర్ లో ఉన్న ఇంట్లో భారీ పాము తిరుగుతూ ఉండేది. దాంతో మోహన్ బాబు ఇంట్లో ముంగిసను పెంచారు. ముంగిస నోట్లో మనోజ్ చెయ్యి పెట్టాడు. కానీ ఏమీ కాలేదు. అంతేకాదు చిన్నప్పుడే 25 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు. నేను మోహన్ బాబు ఇద్దరూ కలిసి హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము. అక్కడ డాక్టర్లు ఇతను పరిస్థితిని చూసి ఆశ్చర్య పోయారు. ఇక మంచు మనోజ్ కి కుట్రలు కుతంత్రాలు తెలియవు.. ఏదైనా పేస్ట్ టు పేస్ మాట్లాడి తేల్చుకుంటాడు. మంచు మనోజ్ స్టార్ డమ్ భైరవం తర్వాత మారిపోతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం సురేష్ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై మోహన్ బాబు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి..
భైరవం మూవీ…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలలో విజయ్ తెరకెక్కించిన చిత్రం భైరవం. ఈ మూవీ మే 30న థియేటర్స్‌లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. తమిళ సూపర్ హిట్ చిత్రం గరుడన్ కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుపుకుంటుంది.. ఇటీవల సెన్సార్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు గంటల 35 నిమిషాల రన్ టైం ని కలిగి ఉంటుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు చూస్తే ప్రేక్షకులకు మతిపోతుంది.. ఎందుకంటే ప్రతి సీను గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదు..