Mohanlal As Kirata : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్ లో కన్నప్ప ఒకటి. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీని కారణం ఈ సినిమా కథ కంటే కూడా ఈ సినిమాలో నటిస్తున్న చాలామంది స్టార్ కాస్ట్ మీద అలానే ఈ సినిమా దర్శకుడు మీద మంచి నమ్మకాలు ఉన్నాయి. వాస్తవానికి మాట్లాడుకుంటే మంచు ఫ్యామిలీ తీసిన సినిమాలు చూడటం జనాలు మానేసి చాలా రోజులైంది. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఫ్యామిలీ సినిమాలు తీస్తున్న కూడా మినిమం కలెక్షన్లు కూడా రావు.
ఇకపోతే కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మోహన్ బాబు ఈ సినిమాకి నిర్మాతకు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుని పాత్రలో కనిపించనున్నారు. అలానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమాలో కిరాట అనే పాత్రలో కనిపిస్తున్నాడు మోహన్ లాల్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అధికారికంగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ ఫస్ట్ లుక్ కూడా నిరాశపరిచింది అని చెప్పాలి. ఈ పోస్టర్ కూడా ట్రోలింగ్ కు గురి అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నష్టాలు చూస్తారు. ఇకపోతే సౌత్ ఇండియాలోని పెద్దపెద్ద నటులు అంతా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
Also Read : Lokesh Kanagaraj: సూపర్ స్టార్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తే ఆ సినిమా చేస్తా
ఇకపోతే విలన్ గా ఎన్నో సినిమాలు ద్వారా గుర్తింపు సాధించుకున్న ముఖేష్ ఋషి ఈ సినిమాలో కంపడు అనే పాత్రను చేస్తున్నాడు. పులిందులు.. అత్యంత పురాతనమైన జాతి, సదాశివ కొండల్లో నివసిస్తుంటారు. వంశపారపర్యంగా పవిత్రమైన వాయు లింగాన్ని సంరక్షిస్తున్న ఈ పులింద జాతిని భద్రగణం అంటారు. భద్ర గణాన్ని నడిపించే నాయకుడే కంపడు. అయితే దీనిని అధికారికంగా ప్రకటిస్తూ ముఖేష్ ఋషి బ్రహ్మాజీ ఉన్న ఒక పోస్టర్ ను కూడా అప్పట్లో లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఇకపోతే ఒకవైపు సినిమా అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు వాళ్ల కుటుంబ గొడవలు కూడా ట్రీట్ చేస్తున్నారు. రీసెంట్ గా మోహన్ బాబు తన వలన గాయపడిన జర్నలిస్టుని కూడా పరామర్శ వెళ్లారు. ఇక్కడితో అంతా సైలెంట్ గా అయిపోయింది అనుకునే తరుణంలో మళ్లీ విష్ణు పై మనోజ్ కంప్లైంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : Game Changer : గేమ్ ఛేంజ్ అవ్వడం లేదు… చరణ్‌కు చరణమే మైనస్..?