BigTV English

Karan Johar: వాళ్లు పెద్ద స్టార్లు కాదు.. ఆ హీరో, హీరోయిన్‌ను అవమానించిన కరణ్ జోహార్

Karan Johar: వాళ్లు పెద్ద స్టార్లు కాదు.. ఆ హీరో, హీరోయిన్‌ను అవమానించిన కరణ్ జోహార్

Karan Johar: సినీ సెలబ్రిటీలు ఏం మాట్లాడినా దానిని తప్పుగా అర్థం చేసుకునేవారు చాలామంది ఉంటారు. తప్పుగా అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా దానిపై చర్చలు మొదలుపెడతారు, నెగిటివ్ కామెంట్స్ చేస్తూ దానిని వైరల్ కూడా చేస్తారు. అలా ఇప్పటివరకు తనపై ఎంతో నెగిటివిటీ వచ్చేలా చేసుకున్నాడు కరణ్ జోహార్. బాలీవుడ్‌లో ఈ స్టార్ ప్రొడ్యూసర్‌పై విపరీతమైన నెగిటివిటీ ఉంది. పైగా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోలు అవ్వాలి అనుకునేవారిని తను అస్సలు ఎంకరేజ్ చేయడు అని చాలామంది ఓపెన్‌గా కామెంట్స్ కూడా చేస్తారు. అలాంటి కరణ్ జోహార్ ఒక హీరో, హీరోయిన్ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ మరోసారి ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారాడు.


హిట్ సినిమా

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్.. సినిమాల గురించి చాలా మాట్లాడాడు. ఆ సందర్భంలో గతేడాది సైలెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి కేవలం మౌత్ టాక్‌తో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘స్త్రీ 2’ గురించి కూడా ఈ స్టార్ ప్రొడ్యూసర్ ప్రస్తావించాడు. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీ.. ఎన్నో పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి మరీ అత్యధిక కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా కలెక్షన్స్, దీనికి వస్తున్న ఆదరణ చూసి ఇండస్ట్రీ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పటికే ఈ మూవీ సక్సెస్ గురించి ప్రశంసించిన కరణ్ జోహార్ (Karan Johar).. తాజాగా ‘స్త్రీ 2’పై మరోసారి కామెంట్స్ చేశాడు.


స్టార్లు కాదు

‘‘బాక్సాఫీస్ వద్ద స్త్రీ 2 (Stree 2) మంచి విజయాన్ని సాధించడం చూసి చాలా సంతోషంగా అనిపించింది. చాలా ప్రోత్సాహంగా కూడా అనిపించింది. ఆ సినిమాలో ఆరుగురు సూపర్ స్టార్లు లేరు, దేశంలోనే అతిపెద్ద స్టార్ లేడు. అయినా కేవలం దర్శకుడు, నిర్మాత పట్టుదల వల్లే ఆ సినిమా అంతలా విజయం సాధించడం చూసి చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. దినేశ్ విజన్, అమర్ కౌశిక్ కలిసి ఇలాంటివి మరెన్నో చేయాలి. రాజ్‌కుమార్ రావు, అభిషేక్ బెనర్జీ, అపర్శక్తి ఖుర్రానా, శ్రద్ధా కపూర్.. అందరూ బాగా చేశారు. కానీ రాజ్‌కుమార్, శ్రద్దా మాత్రం అద్భుతంగా నటించారు. దర్శకుడికి, హీరోకు ఉన్న అనుభవం కంటే నిర్మాతకు ఉన్న అనుభవమే సినిమాను నడిపిస్తుందని నేను బలంగా నమ్ముతాను’’ అని చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్.

Also Read: రష్మిక కోసం సెంటిమెంట్ బ్రేక్ చేసిన సుకుమార్.. కన్నడ బ్యూటీకి బంపర్ ఆఫర్..

నిర్మాతలే ముఖ్యం

‘‘ఒక సినిమాను ఎలా తీశారు, ఎలా ప్రమోట్ చేశారు, ఎలా రిలీజ్ చేశారు అనే విషయాలు చాలా ముఖ్యం. ఏ సమయంలో విడుదల చేశాం, అప్పుడు ఎలాంటి స్ట్రాటజీలు ఉపయోగించాం అనేది కూడా ముఖ్యమే. ఇవన్నీ ఒక సినిమా సక్సెస్‌కు కీలకంగా నిలుస్తాయి. ఇదంతా చాలావరకు నిర్మాతల ప్లానింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది’’ అంటూ నిర్మాతలపై ఉన్న ప్రెజర్ గురించి మాట్లాడాడు కరణ్ జోహార్. అంతా బాగానే ఉన్నా.. అసలు రాజ్‌కుమార్ రావు లాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదిగిన హీరో గురించి మాట్లాడుతూ తను పెద్ద స్టార్ కాదు అనే స్టేట్‌మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కరణ్‌పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×