Rashmika Mandanna: ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్, నార్త్ అన్నీ భాషల్లో బాగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు రష్మిక మందనా (Rashmika Mandanna). హీరోయిన్‌గా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకోవడం పెద్ద విషయం కాదు.. అలా వారు సెలక్ట్ చేసుకున్న ప్రతీ మూవీ హిట్ అవ్వడం పెద్ద విషయం. ప్రస్తుతం రష్మిక విషయంలో అదే జరుగుతోంది. తను పట్టిందల్లా బంగారం అయిపోయింది. సౌత్‌లో, నార్త్‌లో.. ఇలా ఏ భాషలో ఏ సినిమా చేసినా కూడా రష్మికకు హిట్ ఖాయం అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అందుకే తనను గోల్డెన్ లెగ్‌గా భావిస్తూ తనే కావాలంటూ చాలామంది మేకర్స్ రష్మిక కాల్ షీట్స్ కోసం క్యూ కట్టారు. అందులో సుకుమార్ కూడా ఒకరు.
హీరోయిన్‌గా రష్మిక
రష్మిక మందనాతో కలిసి పనిచేయడం కోసం సుకుమార్ తన సెంటిమెంట్ కూడా బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యాడట. ఇప్పటికే ‘పుష్ఫ 2’ ఇచ్చిన సక్సెస్‌తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు సుకుమార్. ‘పుష్ప’ కంటే ముందు కూడా సుకుమార్ డైరెక్షన్ అంటే చాలామంది ఇష్టం. కానీ ఈ సినిమాతో తనలోని కమర్షియల్ డైరెక్టర్‌ను బయటికి తీసుకురావడంతో తనకు మార్కెట్ మరింత పెరిగింది. అందుకే ఈ సక్సెస్ ఇచ్చిన జోష్‌లోనే రామ్ చరణ్‌తో తను చేస్తున్న తరువాతి మూవీకి ప్లానింగ్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇంతలోనే ఇందులో హీరోయిన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
సెంటిమెంట్ బ్రేక్
సుకుమార్, రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’.. చరణ్‌ను కొత్తగా చూపించడంతో పాటు సుకుమార్‌లోని మాస్ ఎలిమెంట్స్‌ను బయటపెట్టింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం కోసం రష్మిక మందనాను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించనప్పటి నుండి హీరోయిన్స్‌ను అసలు రిపీట్ చేయలేదు ఈ డైనమిక్ డైరెక్టర్. అలాంటిది మొదటిసారి రష్మికతో కలిసి మళ్లీ పనిచేయడానికి సిద్ధమయినట్టు తెలుస్తోంది. తన తరువాతి సినిమాలో రామ్ చరణ్‌తో అల్లు అర్జున్ రొమాన్స్ చేయనున్నట్టు సమాచారం.
Also Read: ఫైనల్ లెక్కలు బయటపెట్టిన ‘పుష్ప 2’ మేకర్స్.. మొత్తానికి ఎంత వచ్చిందంటే.?
అప్పుడే మొదలు
అసలైతే హీరోయిన్స్‌ను రిపీట్ చేయని సెంటిమెంట్‌ను సుకుమార్ (Sukumar).. ‘పుష్ప’తోనే బ్రేక్ చేశాడు. ‘పుష్ఫ’ తర్వాత వెంటనే దానికి సీక్వెల్ తెరకెక్కించాడు కాబట్టి ఈ రెండు సినిమాల్లో రష్మికనే హీరోయిన్‌గా నటించింది. ఇక శ్రీవల్లి పాత్రలో ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్‌లోనే రష్మికకు బాగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం అన్ని భాషల్లో కలిపి రష్మిక చేతిలో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గతేడాది చివర్లో ‘పుష్ఫ 2’తో హిట్ కొట్టిన ఈ కన్నడ బ్యూటీ.. ఈ ఏడాదికి బాలీవుడ్‌లో ‘ఛావా’తో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది ‘ఛావా’. ఇందులో రష్మిక పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడుతున్నాయి.