BigTV English

Veer Pahariya: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నా ఇన్‌స్పిరేషన్.. నెపో కిడ్ షాకింగ్ స్టేట్‌మెంట్

Veer Pahariya: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నా ఇన్‌స్పిరేషన్.. నెపో కిడ్ షాకింగ్ స్టేట్‌మెంట్

Veer Pahariya: మామూలుగా ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంత ఈజీ కాదని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అది చాలావరకు నిజమే అన్న విషయం కూడా ఇప్పటికీ చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. అలాంటిది ఏ సపోర్ట్ లేకపోయినా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించిన నటీనటులు ఉన్నారు. అలాంటి వారిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఒకడు. సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చి.. అక్కడ నుండి స్టార్‌గా ఎదిగిన సుశాంత్ ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోయింది. తన జీవితం ఇలా కావడానికి కారణం నెపో కిడ్స్ అని, బాలీవుడ్ మాఫియా అని తన ఫ్యాన్స్ ఇప్పటికీ అంటుంటారు. అలాంటి సుశాంతే తన ఇన్‌స్పిరేషన్ అని ఒక నెపో కిడ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.


సుశాంతే కారణం

బాలీవుడ్‌లో నెపో కిడ్స్‌ను హీరోలుగా లాంచ్ చేయడం పెద్ద విషయం కాదు. దానికోసం కొన్ని బడా నిర్మాణ సంస్థలు సైతం ముందుకొస్తాయి. మంచి దర్శకులు, మంచి కథలు సిద్ధంగా ఉంటాయి. అలాంటి బీ టౌన్‌లోకి మరో నెపో కిడ్ ఎంటర్ అయ్యాడు. తనే వీర్ పహారియా. ‘స్కై ఫోర్స్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వీర్ పహారియా.. ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా గడిపేస్తున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్ మెయిన్ హీరోగా నటించగా వీర్ పహారియా కూడా కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుశాంత్ సింగ్ ఇన్‌ఫ్లుయెన్స్ తనపై ఎంత ఉంది అనే విషయాన్ని బయటపెట్టాడు వీర్. అంతే కాకుండా మరెన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


ఇన్‌స్పైర్ చేశాడు

‘‘సుశాంత్ నన్ను నిజంగానే ఇన్‌స్పైర్ చేశాడు’’ అని చెప్తూ సుశాంత్ కెరీర్ మొత్తాన్ని ఒక్కసారిగా గుర్తుచేసుకున్నాడు వీర్ పహారియా. ‘కాయ్ పో చీ’ మూవీ ద్వారా సుశాంత్‌కు ఎలా పాపులారిటీ లభించిందో చెప్పుకొచ్చాడు. ఒక మంచి ఆడియన్స్‌కు చెప్పడానికి తను తపనపడేవాడని అన్నాడు. కేవలం కమర్షియల్ సినిమాలు, పాత్రలతోనే కాకుండా ఆర్ట్‌ను ప్రేక్షకుల వరకు తీసుకెళ్లే నటుడు సుశాంత్ అంటూ తనను ప్రశంసలతో ముంచేశాడు వీర్ పహారియా. ఈ నెపో కిడ్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మాత్రమే కాకుండా మిక్స్‌డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. సుశాంత్ ఉన్నప్పుడు ఒక్క నెపో కిడ్ కూడా తనను ఎంకరేజ్ చేయలేదని ఫ్యాన్స్ వాపోతున్నారు.

Also Read: మూడో పెళ్లికి సిద్ధమయిన బాలీవుడ్ నటి.. ఈసారి ఏకంగా పాకిస్థాన్ వ్యక్తితో..

పాజిటివ్ రెస్పాన్స్

వీర్ పహారియా (Veer Pahariya) డెబ్యూ చిత్రం ‘స్కై ఫోర్స్’ (Sky Force) ఇటీవల థియేటర్లలో విడుదలయ్యింది. అక్షయ్ కుమార్ ఇదివరకే ఇలాంటి సినిమాల్లో నటించినా కూడా వీర్ కూడా ఇందులో యాడ్ అవ్వడంతో మూవీకి మేజర్ ప్లస్ అయ్యాడు. ప్రస్తుతం ఈ మూవీ పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతోంది. మొదటి సినిమానే అయినా ఇందులో వీర్ యాక్టింగ్ చాలా బాగుందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో వీర్‌కు జోడీగా సారా అలీ ఖాన్ నటించింది. వీర్ హీరో కాకముందే సారా అలీ ఖాన్‌కు, తనకు మధ్య రిలేషన్‌షిప్ ఉండేదని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×