BigTV English

Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ఫ్రాడ్ ముఠా గుట్టురట్టు.. నిందితుల్లో బ్యాంకు మేనేజర్లు

Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ఫ్రాడ్ ముఠా గుట్టురట్టు.. నిందితుల్లో బ్యాంకు మేనేజర్లు

Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ఫ్రాడ్ ముఠా గుట్టురట్టు అయింది. నిందుతుల్లో బ్యాంకు మేనేజర్ తో సహా, 52మందిని అరెస్ట్ చేశారు. అమాయకులను లక్ష్యం గా చేసుకొని మోసాలు చేస్తున్న గ్యాంగ్ తో చేతులు కలిపిన బ్యాంక్ మేనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసులో రూ.93 లక్షల స్కామ్ జరిగిందని ఇది ఇండియాతో పాటు, నేపాల్, చైనా ఇలా మూడు ప్రాంతాల్లో విస్తరించింది సీవీ ఆనంద్ వెల్లడించారు. నిందితుల్లో శుభమ్ కుమార్, డిప్యూటీ మేనేజర్, రషీద్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్, ఆర్ మోహన్ మొదలైన వారు ఈ కేసులో నిమగ్నమై ఉన్నట్లు పేర్కొన్నారు.


బాధితుడు ఫేస్ బుక్ యూజ్ చేస్తున్న సమయంలో.. వాట్సాప్ మెసేజ్‌లతో అతన్ని ఆకర్షంచి, ఫస్ట్ ఆశ చూపి గ్రూప్ సభ్యల పేరుతో మోసం చేశారని పోలీసులు తెలిపారు. అయితే మొదటి రూ. 40 వేలు పెట్టుబడి పెట్టగా.. ఫ్రాఫిట్ వచ్చింది.. అనంతరం మరింత పెట్టుబడులు పెట్టేలా చేసి మోసపోయినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు బ్యాంక్ ఆఫీసర్ కావడంతో అనేక ఫేక్ బ్యాంక్ అకౌంట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రజలకు సూచించారు.

అలాగే మరో నిందితుడు కోటక్ మహీంద్ర బ్యాంక్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి.. వందలాది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, ప్రజలను మభ్యపెట్టి పలు రకాల మెసేజ్‌లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. కొన్ని మెసేజ్‌లు చూపిస్తూ.. ఇలాంటివి సైబర్ నేరగాళ్లు మాత్రమే పెడతారని.. ఆ మెసేజ్‌లు చూసి మోసపోవద్దని పోలీసులు సూచించారు. ఈ కేసులో తొలిసారి మహ్మద్ జునైద్‌ను పట్టుకున్నామని.. అతడు క్రిప్టో కరెన్సీని మార్పు చేస్తాడని.. ఆ సమయంలోనే నేరస్థులను పట్టుకున్నామని సీవీ ఆనంద్ తెలిపారు.


తెలంగాణ పోలీసులు కష్టపడి 2.87 కోట్ల కోట్ల స్కామ్ పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రాపర్టీస్‌లలో ముబైల్ ఫోన్స్ 43, ఏటీఎం కార్డులు 39, పాస్ బుక్ లు 17, చెక్ బుక్ లు54, సిమ్ కార్డ్‌లు 16, లాప్ టాప్‌లు 3, ఆధార్ కార్డులు 9, క్యూఆర్ కోడ్స్ 3, క్రిప్టో కరెన్సీ వాటితో రూ.40 లక్షలు, నెట్ క్యాష్ వాటితో రూ.47 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. మొదటి సారీగా క్యాష్‌ను వాళ్లు విత్ డ్రా చేసుకున్న సందర్భాలలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినట్లు తెలిపారు.

Also Read: కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకు ఈసారైనా ప్రయోజనం ఉంటుందా?.. లేక మొండిచేయేనా?

కాగా.. సైబర్ నేరాల అంశంపై అవగాహన చాలా ముఖ్యమన్నారు హైదరాబాద్‌ సీపీ.. సీవీ ఆనంద్‌. నేరస్థుల వేసి ఎత్తుగడలకు.. చదువుకున్న వారు కూడా పడిపోతున్నారని సీపీ వ్యాఖ్యానించారు. సైబర్ క్రైమ్‌ మోసాలు ద్వారా.. గతేడాది 3 వేల 500 కోట్లు మోసం జరిగిందన్నారు. అందులో 13 శాతం వరకే రికవరీ అయ్యిందని సీపీ చెప్పారు.

నిందితులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు అయినా.. సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న విషయాన్ని సీపీ గుర్తు చేశారు. ఆయా సిబ్బందికి అభినందనలు తెలుపుతూ.. నగదు ప్రోత్సాహాకాన్ని అందించారు. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ వెల్లడించారు

 

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×