Karishma Kapoor: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ (Karishma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్ (Sanjay Kapoor) గత రెండు రోజుల క్రితం తేనెటీగ శ్వాసనాళాలలో దూరి.. శ్వాస ఆడగా గుండెపోటు వచ్చి మరణించిన విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక తేనెటీగ మనిషి ప్రాణాలు తీయడం ఏంటి ? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. 2025 జూన్ 12 గురువారం సాయంత్రం ఇంగ్లాండులోని విండర్స్ లో గార్డ్స్ పోలో క్లబ్బులో క్వీన్స్ కప్ పోలో టోర్నమెంట్ జరిగింది. ఇందులో సంజయ్ కపూర్ తన ఆరియాస్ పోలో టీం తరఫున సృజన్ టీం తో ఆడుతున్నారు. హార్స్ రైడింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక తేనెటీగ ఆయన గొంతులోకి చొచ్చుకుపోయింది. దీనివల్ల అనఫిలాక్సిస్ అనే అలర్జీ ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు.
తేనెటీగ కుట్టి కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి..
సంజయ్ ఆటను ఆపి ఆట మైదానం నుంచి బయటకు వెళ్లిన వెంటనే కుప్పకూలిపోయారు. వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనఫిలాక్సిస్ అనేది ఇదొక ప్రాణాంతక అలర్జీ.. రక్తపోటు ఆకస్మికంగా పడిపోవడం, శ్వాసనాళాలు ఇరుకైపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. గొంతు లోపలికి వెళ్ళిన తేనెటీగ అక్కడ కుట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని.. ఫలితంగా శ్వాస నాళాలలో వాపు ఏర్పడి శ్వాస ఆడకుండా చేసిందని వైద్యులు తెలిపారు. ఇకపోతే పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉన్న సంజయ్ కపూర్ ని ఒక తేనెటీగ చంపడం నిజంగా దురదృష్టకరమని చెప్పాలి.
సంజయ్ కపూర్ వ్యక్తిగత జీవితం..
ఇకపోతే ఈయన మరణాంతరం ఈయనకి ఉన్న రూ.31 వేల కోట్ల ఆస్తులు ఎవరికి వెళ్తాయి? అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. 2003లో కరిష్మా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు సంజయ్ కపూర్. ఇక ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2016లో వీళ్ళిద్దరూ విడిపోయారు. అప్పటికే వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కరిష్మా కపూర్ నుండి విడిపోయిన తర్వాత సంజయ్ ప్రముఖ మోడల్ నటి ప్రియా సచ్ దేవాను 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కూడా ఒక కొడుకు, కూతురు జన్మించారు. ఇకపోతే సంజయ్ కపూర్ వీరిద్దరి కంటే ముందే 1997లో ఫ్యాషన్ డిజైనర్ నందిత మహతానిని వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.
సంజయ్ కపూర్ మరణాంతరం ఆయన ఆస్తి ఎవరికి?
ఇకపోతే సంజయ్ కపూర్ ఎవరో కాదు సురేందర్ కపూర్ -రాణి కపూర్ దంపతుల కుమారుడు. 2015లో సురేందర్ గుండెపోటుతో మరణించడంతో తండ్రి బాధ్యతలను తీసుకున్నారు సంజయ్ కపూర్. ఇక సంజయ్ కి మందిరా కపూర్, సుపర్ణ మోత్వాని అనే ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంజయ్ మరణానంతరం ఆయన సోదరీమణులు ఆయన వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఇక సంజయ్ సోనా కామ్ స్టార్ యజమాని. అలాగే సోనా కాం స్టార్ మార్కెట్ విలువ రూ.31 వేల కోట్లు. ఇక సంజయ్ కపూర్ తన వ్యక్తిగతంగా 12 వేల కోట్ల రూపాయలను సంపాదించారు. ఇక భార్యల నుండి విడిపోయినప్పటికీ తన నలుగురు పిల్లల బాధ్యతను సంజయ్ కపూర్ నిర్వర్తించాడు. ఇక మొత్తానికి ఇప్పుడు సంజయ్ కపూర్ సంపాదించిన 12 వేల కోట్లు మాత్రమే పిల్లలకు చెందుతాయని, ఇక మిగతా 31 వేల కోట్లు బాధ్యత ఆయన సోదరీమణులు తీసుకోబోతున్నట్లు సమాచారం.
ALSO READ:Big TV Kissik Talks: వర్ష జీవితంలో ఇంత విషాదమా.. తన బావ మరణంతో