IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… లీక్ దశ మ్యాచ్ లు అన్ని పూర్తయ్యాయి. ఇప్పటివరకు 70 మ్యాచ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు.. కేవలం నాలుగు మ్యాచ్లు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో గెలిచినట్టు.. ఛాంపియన్గా నిలుస్తుంది. క్వాలిఫైయర్ వన్ , ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, ఫైనల్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది.
Also Read: Kohli – Anushka: గ్రౌండ్ లోనే రొ**మాన్స్.. కోహ్లీకి ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ అనుష్క రచ్చ
క్వాలిఫైయర్ 1
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లు తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ చండీగర్ లోని ముల్లాన్పూర్ వేదికగా జరగనుంది. రేపు అంటే 29వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు పంజాబ్ కింగ్స్ ( punjab kings) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) మధ్య క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జియో హాట్స్టార్ లో మనము ఉచితంగా చూడవచ్చు.
ఎలిమినేటర్ మ్యాచ్ ఎవరి మధ్య అంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగర్ లోని ముల్లాన్పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ మే 30వ తేదీన అంటే ఎల్లుండి జరగనుంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ కూడా ప్రారంభం అవుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జియో హాట్ స్టార్ లో చూడవచ్చు.
క్వాలిఫైయర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఇక క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ లో ఓడిన జట్టు తలపడుతుంది. అందులో గెలిచిన జట్టు ఫైనల్ కి వెళ్తే ఓడిపోయిన జట్టు ఇంటికి వెళ్తుంది. అంటే ఇక్కడ పంజాబ్ కింగ్స్ అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు మంచి ఆఫర్ ఉందన్నమాట. క్వాలిఫైర్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా ఒక ఛాన్స్ ఉంటుంది.
ఫైనల్ ఎప్పుడు అంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొత్త షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో జరగనుంది. జూన్ మూడో తేదీన ఈ మ్యాచ్ నిర్వహించబోతున్నారు. వాస్తవంగా మేం 25వ తేదీన ఈ మ్యాచ్ జరగాల్సి ఉండేది. కానీ షెడ్యూల్ మారడంతో జూన్ మూడో తేదీన ఈ మ్యాచ్ జరుగుతుంది.
ALSO READ: Vigilance on HCA : SRH ఓనర్ కావ్య పాప కొంప ముంచిన HCA… బెదిరింపులు చేసి మరి!
Punjab Kings touch down in Mullanpur for Qualifier 1🏏
📸: PBKS pic.twitter.com/spuVTi1yOj
— CricTracker (@Cricketracker) May 28, 2025