BigTV English

Sathyam Sundaram Teaser: ‘సత్యం సుందరం’ వచ్చేసారు.. టీజర్ భలే ఉంది గురూ

Sathyam Sundaram Teaser: ‘సత్యం సుందరం’ వచ్చేసారు.. టీజర్ భలే ఉంది గురూ

Sathyam Sundaram Teaser: కోలీవుడ్ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో తెలుగు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. స్టార్ హీరో తమ్ముడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కార్తీ ఇప్పుడు తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు. సూర్య తమ్ముడిగా కాకుండా హీరోగా కార్తీగా గుర్తింపు పొందాడు. ఓవైపు కోలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే మరోవైపు టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు.


‘ఆవారా’తో మొదలైన అతడి టాలీవుడ్ ప్రయాణం పరుగులు పెడుతోంది. వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలతో సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించిన కార్తీ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘96’ ఫేం ప్రేమ్ కుమార్.సి దర్శకత్వంలో ‘సత్యం సుందరం’ అనే సినిమా చేస్తున్నాడు.

ఇందులో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో ఈ సినిమా ‘మెయ్యళగన్’ పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య – జ్యోతిక కలిసి నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో రాజ్ కిరణ్, శ్రీదేవి వంటి నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అందరిలోనూ అంచనాలు పెంచేశాయి.


Also Read: నయనతారకు హ్యాకర్స్ షాక్.. వారికి రిక్వెస్ట్ చేసిన లేడీ సూపర్ స్టార్

ఇప్పుడు తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో కార్తీ, అరవింద్ స్వామి యాక్టింగ్ చాలా అత్యద్బుతంగా ఉంది. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు భాగా నచ్చేసింది. డిఫరెంట్ స్టైల్లో కార్తీ, అరవింద్ యాక్టింగ్ అదరగొట్టేశారు. కార్తీ అమాయకత్వంతో రస్టిక్ క్యారెక్టర్‌ చేసి దుమ్ము దులిపేశాడు. అదే సమయంలో అరవింద్ స్వామి రిజర్వ్‌డ్ అండ్ అర్భన్ పర్సనాలిటీ లుక్‌లో కనిపించి అభిమానులకు ట్రీట్ అందించాడు.

‘96’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టేలా అనిపిస్తున్నాడు. టీజర్‌లో చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ సినీ ప్రియుల్లో మంచి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది. అలాగే మహేంద్రన్ జయరాజు కెమెరా వర్క్ సూపర్ అని చెప్పాలి. గోవింద్ వసంత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. కాగా ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ‘దేవర’ రిలీజ్ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్ 28న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×