BigTV English

Sardar 2: ఎస్.జే సూర్య Vs కార్తీ… హాలీవుడ్ రేంజ్ టీజర్

Sardar 2: ఎస్.జే సూర్య Vs కార్తీ… హాలీవుడ్ రేంజ్ టీజర్

Sardar 2: ఈరోజు కార్తీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న “సర్దార్ 2” ప్రోలాగ్ ఫైనల్‌గా విడుదలైంది. మధ్యాహ్నం 12:45కి రిలీజ్ అయిన ఈ ప్రోలాగ్, అంచనాలకు మించి ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. “సర్దార్” ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈసారి సినిమాను కేవలం సీక్వెల్‌గా కాకుండా, ప్రీక్వెల్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ స్పై థ్రిల్లర్‌గా తీర్చిదిద్దినట్లు స్పష్టమైంది.


ప్రోలాగ్‌లో కార్తీ ఓ మాస్ అవతార్‌లో కనిపించాడు. జపనీస్ కటానా (కత్తి) పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో కనిపించడంతో, ఈసారి అతని క్యారెక్టర్ మరింత ఫియర్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ ప్రొమోలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్స్ ఉన్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. P.S. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, విజువల్స్ పరంగా హై స్టాండర్డ్స్‌లో ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, సర్దార్ మిషన్ తో పాటు ఆయన కొడుకు క్యారెక్టర్ కార్తీని కూడా మిషన్ లోకి తీసుకోని వస్తున్నాడు ఉన్నాడు దర్శకుడు, ప్రోలాగ్ చివరిలో యంగ్ లుక్ కార్తీని రివీల్ చేయడంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇది కథకు కొత్త లేయర్ ని జోడించబోతోంది. ఈ బ్యాక్‌స్టోరీ ద్వారా, సర్దార్ ఎలా ఓ అద్భుతమైన స్పైగా మారాడు? అతని గతంలో ఏమి జరిగింది? అనే అంశాలు సినిమా స్పెషల్ ఎలిమెంట్స్‌గా మారే ఛాన్స్ ఉంది.


SJ సూర్య కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రోలాగ్ చూస్తే, అతని క్యారెక్టర్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. వరల్డ్ సెక్రెట్ ఏజెన్సీస్ వెతికే విలన్ గా ఎస్.జే సూర్య కనిపిస్తున్నాడు. ఇంతటి యాంటి సోషల్ ఎలిమెంట్ ఇండియా మీదకి వస్తే సర్దార్ ఎలా ఆపాడు అనేదే కథలా కనిపిస్తుంది. కోర్ ఎలిమెంట్ ని రివీల్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియాని కాపాడే పనిలో సర్దార్… ఎస్.జే సూర్యతో మైండ్ గేమ్ కి దిగుతాడా లేక నేరుగా ఫేస్‌ఆఫ్ ఉంటుందా? అనే విషయంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రోలాగ్ విడుదలైన వెంటనే, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్ ఊహించని స్థాయిలో వచ్చింది. “సంభవం గ్యారంటీ!” అని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా, “సర్దార్ 2” ముందు భాగాన్ని మించిన స్థాయిలో రూపొందించారని, ఇంకా మిగిలిన భాగాలు అద్భుతంగా ఉండబోతున్నాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఫైనల్ వర్డిక్ట్ – “సర్దార్ 2” ప్రోలాగ్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. కార్తీ కొత్త లుక్, ఇంటెన్స్ యాక్షన్, స్టోరీ డెప్త్ చూసిన తరువాత, ఇది హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×