Civil Ranker Story: ఓవైపు జాబ్ చేస్తూనే.. మరో వైపు ఇల్లాలుగా ఇంట్లో పనులు అన్నీ చేస్తూనే సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించింది భాగ్యనగరానికి చెందిన రాపర్తి ప్రీతి. ఏన్ని ఆటంకాలు ఎదురైనా నిరంతరం కృషి చేస్తే సక్సెస్ వస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రీతి అని చెప్పవచ్చు. లక్ష్యం కోసం అలుపెరగకుండా నిరంతరం శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం సొంతమవుతోంది. లక్ష్య సాధనలో ప్రతి రోజు అదే పనిగా ముందుకుళ్లే విజయం దానంతటే అదే వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేడ్చల్ మల్కాజిరిగి జిల్లా కూకట్ పల్లికి చెందిన రాపర్తి ప్రీతి.
జాబ్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను..
ఇంట్లో జాబ్ చేస్తూనే.. మరో వైపు ఇంటి బాధ్యతలను మోస్తూ.. సివిల్స్‌లో 451 ర్యాంకు సాధించి గ్రేట్ అనిపించుకుంటున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కుటుంబం నుంచి వచ్చిన ప్రీతి చిన్నతనం నుంచే తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగారు. కష్టాలు తెలుసు. బాధులు.. కన్నీళ్లు తెలుసు. పేరెంట్స్ తనపై పెట్టుకున్న నమ్మకం.. భర్త ప్రోత్సాహం.. కోచింగ్ లేకుండానే సివిల్స్ ర్యాంక్ సాధించి ప్రముఖుల నుంచి అభినందనలు పొందుతోంది.
మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ..
జాబ్ చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యానని ప్రీతి చెప్పారు. ‘మాది కూకట్ పల్లి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నతనం నుంచి నాన్న పడే కష్టాలు చూశాను. మా చదువు కోసం మా అమ్మ అర్చన, నాన్న రాపర్తి నందకిశోర్ చాలా కష్టపడ్డారు. అన్నయ్య, నేను… ఇద్దరు సంతానం. నేను కీస్ హైస్కూల్‌లో చదివా. 2016 లో ఓయూ (ఉస్మానియా యూనివర్సిటీ) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను’ అని ప్రీతి చెప్పుకొచ్చారు.
మూడేళ్ల పాప ఉంది.. అయినా..?
‘సివిల్స్ కు నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. 2019 లో ఫస్ట్ టైం రాశాను. మెయిన్స్ లో పోయింది. 2021 లో పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత డాడీ చనిపోయాడు. ఇప్పుడు నాకు మూడేళ్ల పాప ఉంది. తనను చూసుకుంటూనే ఉద్యోగం చేశాను. మరో వైపు సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాను. కొవిడ్ టైంలో వర్క్ ఫ్రం హోం చాలా కలిసి వచ్చింది. ఇంట్లో పాపను, ఫ్యామిలీని చూసుకుంటూ ఉద్యోగం చేసుకునే అవకాశం లభించింది’ అని అన్నారు.
సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను..
‘ఎలాగైనా సివిల్స్ క్రాక్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాను. మా భర్త నాకు ప్రోత్సాహం అందించారు. ఎళ్లవేళలా అండగా నిలిచారు. అయితే పాప, ఇంట్లో పనులు, జాబ్ ఇవన్నీ చేయడం, మళ్లీ సివిల్స్ కు ప్రిపేర్ అవ్వడం కొంచెం ఇబ్బందేమో అని భావించాను. అదే విషయం మా భర్తకు చెప్పాను. ఇంటి పనులు వదిలేసి అయినా సరే సివిల్స్ కోచింగ్ వెళ్లమని ఆయన ప్రోత్సహించారు. సివిల్స్ ఎగ్జామ్స్ రాసి నాలుగేళ్లు అవుతోందని.. ప్రస్తుతం కాంపిటేషన్ హెవీగా ఉందని అన్నాను. కానీ ఆయన నాలో స్ఫూర్తి నింపారు. దీంతో రెండేళ్ల నుంచి పట్టుదలతో సివిల్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను’ అని చెప్పారు.
Also Read: UIICL Recruitment: సువర్ణవకాశం.. ఏదైనా డిగ్రీ అర్హతతో అప్రెంటీస్ పోస్టులు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం..
అయితే ఎక్కడా కోచింగ్ వెళ్లకుండా ఆన్ లైన్ లోనే సమాచారం సేకరించాను. నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆన్ లైన్ లోనే వెతికేది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం నాకు కలిసొచ్చింది. అప్పుడప్పుడూ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేంది. ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయినప్పుడు కూడా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు’ అని ప్రీతి చెప్పారు.