Bizarre Incident PSL 2025 : పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సూపర్ లీగ్ పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకోవడం విశేషం. ఇప్పటికే పీఎస్ఎల్ లో విరాట్ కోహ్లీ జెర్సీ ధరించడం వంటివి మనం నిత్యం వింటూనే ఉన్నాం. తాజాగా ముల్తాన్ సుల్తాన్, లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. యువ పేసర్ ఉబైద్ షా గందరగోళంలో ఉన్నాడు. అతను అద్భుతమైన స్పెల్ తో బౌలింగ్ చేశాడు. అయితే అనుకోకుండా తన సొంత సహచరుడిని కొట్టినందుకు సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
Also Read : Nicholas Pooran : బంతి తగిలి అభిమానికి గాయం.. పూరన్ చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే
పీఎస్ఎల్ మ్యాచ్ సమయంలో ఉబైద్ షా అనుకోకుండా తన సహచరుడు ఉస్మాన్ ఖాన్ ను కొట్టాడు. ఖాలందర్స్ 226 పరుగుల భారీ ఛేదనలో ప్రమాదకరమైన సామ్ బిల్లింగ్స్ ను ఉబైద్ ఔట్ చేశాడు. తరువాత క్షణం ఆవిష్కృతమైంది. అడ్రినలిన్ తో అధిగమించి ఉబైద్ చుట్టూ తిరిగాడు. విజయోత్సాహంతో దూసుకెళ్లాడు. అనుకోకుండా కీపర్ ఉస్మాన్ ఖాన్ తలపై తన అరచేతి తో బలంగా కొట్టాడు ఉబైద్. ఉస్మాన్ కేవలం టోఫీ మాత్రమే ధరించాడ. హెల్మెంట్ దరించకపోవడం విశేషం. ఈ సంఘటన కెమెరాలలో బంధించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీఎస్ఎల్ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత చర్చనీయాంశంగా మారింది ఈ విషయం.
అనుకోకుండా హిట్ అయినప్పటికీ మ్యాచ్ పై ఉబైద్ ప్రభావం తప్పలేదు. ముల్తాన్ లో సుల్తాన్ లు 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించేందుకు 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశారు. అంతకు ముందు ముల్తాన్ 229 భారీ పరుగులు చేసింది. అయితే లాహోర్ మాత్రం తొలి నాలుగు ఓవర్లలో 38 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ కేవలం 14 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఆ తరువాత అతను నిష్క్రమించడంతో ఆ ఊపు అలాగే కొనసాగించలేకపోయింది. అబ్దుల్లా షఫీక్, డారిల్ మిచెల్ 36 పరుగుల భాగస్వామ్యం ఎక్కువ సేపు నిలవలేకపోయింది. లాహోర్ ను 87/4 పరుగులకే తిప్పికొట్టింది.
ఓ రన్ రేటు పెరుగుతుంది. మరోవైపు పరుగులు మాత్రం పెరగడం లేదు. సామ్ బిల్లింగ్స్, సికందర్ ఝా రన్ రేట్ పెంచేందుకు ప్రయత్నించారు. ఇక సామ్ బిల్లింగ్స్ 23 బంతుల్లో 43 పరుగులు చేశారు. ఇందులో నాలుగు సిక్స్ లు, 2 ఫోర్లు బాదాడు. దీంతో లాహోర్ కి ఆశలు చిగిరించాయి. కానీ అతను ఔట్ అయిన తరువాత ముల్తాన్ వైపు మ్యాచ్ తిరిగింది. మరోవైపు రజా 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కానీ లాహోర్ 195/9 తోనే ముగించడంతో లక్ష్యాన్నిచేరుకోలేకపోయింది. 34 పరుగుల తేడా ఓడిపోయింది. అంతకు ముందు ముల్తాన్ సుల్తాన్ లు వరుసగా మూడు పరాజయాలను ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఈ మ్యాచ్ లో లాహోర్ పై 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. మూడు వరుస పరాజయాల తరువాత ఈ మ్యాచ్ లో గెలవడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.
Rey 🤣🤣😭 pic.twitter.com/oj59d8N8H6
— Yaghnesh (@Yaghnesh1) April 22, 2025