Yuganiki Okkadu re release: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. గతంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హీట్ అయినా సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు మరోసారి భారీగా కలెక్షన్లు అని వసూలు చేశాయి. రీసెంట్ గా ఓ సినిమా తన రీరీలీజ్ డేట్ ను అనౌన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా 15 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి డేట్ ని అనౌన్స్ చేసింది. ఆ సినిమా ఏంటి? ఎప్పుడు రిలీజ్ అవుతుందో? ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తమిళ స్టార్ హీరో సూర్య ( suriya ) తమ్ముడు కార్తీకి తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్లో ఈయన చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. కార్తీ ( karthi ) హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమా అప్పటిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇందులో రీమా సేన్, ఆండ్రియా జెరేమియా హీరోయిన్లు. కోలీవుడ్ సీనియర్ కథానాయకుడు ఆర్ పార్థిబన్ ఒక కీలక పాత్ర చేశారు. జనవరి 14, 2010 లో ఈ సినిమా విడుదల అయ్యింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ అవ్వబోతుంది. మార్చి 14 న ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..
Also Read :‘పుష్ప 2’ పిల్లలను చెడగొట్టింది.. సెన్సార్ బోర్డు పై హెడ్ మాస్టర్ ఫైర్..
ఈ మూవీని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తుంది ఎవరంటే.. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేతలు ‘యుగానికి ఒక్కడు’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రైమ్ షో ఫిలిమ్స్ పతాకం మీద ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను కూడా ప్రైమ్ షో ఫిలిమ్స్ విడుదల చేసింది. ఒక వైపు సినిమాలు ప్రొడ్యూస్ చేయడంతో పాటు మరొక వైపు క్రేజీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటుగా, ఇలా పాత సినిమాలను రిలీజ్ కూడా చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో కార్తీ హీరో కాదు. తన తమ్ముడు ధనుష్ హీరోగా సీక్వెల్ చేయనున్నట్లు సెల్వ రాఘవన్ తెలిపారు. ఆ సినిమాలో విజయ్ ఆంటోనీ కూడా నటించనున్నట్లు చెప్పారు.. అయితే ధనుష్ ( Danush ) వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాపై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ రానుందని సమాచారం..
The 𝐂𝐇𝐎𝐋𝐀𝐒 Are Returning! ⚔️🔥
The epic fantasy masterpiece #YuganikiOkkadu is set to reignite the silver screen once again after 15 long years❤️🔥#YuganikiOkkaduReRelease in theatres from MARCH 14th 💥
Releasing in AP & TG, Karnataka, and USA through @primeshowfilms
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2025
ప్రస్తుతం హీరో ధనుష్ సినిమాల విషయానికొస్తే. కుబేర సినిమాలో నటిస్తున్నారు అలాగే సినిమాలను నిర్మించడంతోపాటు సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు . అటు కార్తీ విషయానికొస్తే.. ఆయన కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.