BigTV English
Advertisement

OTT Movie : హాస్టల్ అమ్మాయిలతో దారుణమైన పనులు … మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : హాస్టల్ అమ్మాయిలతో దారుణమైన పనులు … మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. మలయాళం నుంచి వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అందుకున్నాయి. తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఇటువంటి సినిమాలు చాలానే వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో అమ్మాయిలు ఒక కాలేజీలో వరుస హత్యలకు గురవుతూ ఉంటారు. ఆ మిస్టరీ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


హాట్ స్టార్ (hotstar) లో

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డి బ్లాక్’ (D Block). 2022లో విడుదలైన ఈ తమిళ థ్రిల్లర్ మూవీకి నూతన దర్శకుడు విజయ్ కుమార్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. MNM ఫిలింస్ బ్యానర్‌పై సినిమాటోగ్రాఫర్ అరవింద్ సింగ్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో కారు పళనియప్పన్, చరణ్‌దీప్, తలైవాసల్ విజయ్, రమేష్ ఖన్నా, ఉమా రియాజ్ ఖాన్‌ నటించారు. అరవింద్ సింగ్ సినిమాటోగ్రఫీ, గణేష్ శివ ఎడిటింగ్ అందించారు. ఈ మూవీ 1 జూలై 2022న థియేటర్‌లలో విడుదలైంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథాంశం, పనితీరుకు ప్రశంసలు వచ్చాయి. డిసెంబర్ 2022లో హిందీ డబ్బింగ్ వెర్షన్ అదే పేరుతో విడుదలైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ (hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

ఒక కాలేజీలో స్వాతి అనే అమ్మాయి డి బ్లాక్ లో బట్టలు ఆరవేయడానికి వెళ్తుంది. అక్కడికి ఒక గుర్తు తెలియని మనిషి వచ్చి ఆమెను చంపేస్తాడు. ఆ తర్వాత ఈ కేసును పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తారు. అయితే ఆమె మొహం మీద గాట్లు ఉండటంతో, జంతువులు అటాక్ చేసి ఉంటాయని చెప్తారు. కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ఈ కేసును బయటకు రానీయకుండా, క్లోజ్ చేయాలని పోలీసులకు చెప్తాడు. దానికి ఎంత డబ్బు అయినా ఇస్తానని పోలీసులతో అంటాడు. మరోవైపు అదే కాలేజీలో ఉండే ఆమె స్నేహితులు, ఆమె మరణం పై సందేహాలు వ్యక్తం చేస్తారు. ఆమె స్నేహితుడైన అరుణ్ అదే హాస్టల్లో ఒక భయంకర ఆకారంలో ఉండే మనిషిని చూస్తాడు. చనిపోయిన స్వాతి కూడా ఒక ఆకారాన్ని డ్రా చేసి ఉంటుంది. మరోవైపు మాయ అనే అమ్మాయి కూడా ఈ హత్య విషయంలో అరుణ్ కి హెల్ప్ చేస్తుంది. ఇదివరకే కాలేజీలో చాలా మంది అమ్మాయిలు కనిపించకుండా పోతారు. వీళ్లంతా కలిసి ఇదివరకు మిస్ అయిన అమ్మాయిల వివరాలు తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో వీళ్లకు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తాయి. చివరికి అమ్మాయిలను హత్యలు చేస్తోంది ఎవరు? అరుణ్ తెలుసుకున్న విషయాలు ఏమిటి? నేరస్తులకు శిక్ష పడుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ (hotstar) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘డి బ్లాక్’ (D Block) అనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

Related News

The Family Man 3 OTT: ఎట్టకేలకు ఓటీటీకి ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

OTT Movie : పెళ్ళాల గొడవలతో దూరమయ్యే ప్రాణ స్నేహితులు… పిల్లలిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్… కితకితలెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ప్రతీ 5 నిమిషాలకు ఆ ఇంటెన్షన్ ఉన్న టెన్షన్ పెట్టే సీన్.. .సింగిల్స్ కు పండగే

OTT Movie : పిల్ల రూపంలో వచ్చే పిశాచి భయ్యో… డోర్ తీశారో దరువే… ఒంటరిగా చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : పిల్లల పెళ్ళిళ్ళను చెడగొట్టే దిక్కుమాలిన ఆచారం… కడుపుబ్బా నవ్వించే మలయాళం కామెడీ థ్రిల్లర్

OTT Movie : అడవిలో అంధుడి అరాచకం… 1 గంట 48 నిమిషాల గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఈగోను శాటిస్ఫై చేసే మలయాళం రివేంజ్ డ్రామా

OTT Movie : పక్కింటి అమ్మాయిపై ఆ ఫీలింగ్…తేడా అంటూ కోడై కూసే ఊరు… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ఈ వారం రాబోతున్న కొత్త మలయాళం సినిమాలు… ఆ మూడూ ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్

Big Stories

×