Salman Khan in Baby John: 2024 క్రిస్మస్‌కు బాక్సాఫీస్ జోరు కాస్త డల్‌గానే ఉంది. హైప్ ఉన్న సినిమాలు కూడా ఎక్కువగా విడుదల కాకపోవడంతో విడుదలయ్యే సినిమాలపైనే ప్రేక్షకులు ఫోకస్ పెట్టారు. అందులో హిందీ సినిమా ‘బేబి జాన్’ కూడా ఒకటి. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబి జాన్’ సినిమా.. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తేరీ’కి రీమేక్‌గా తెరకెక్కింది. ఖలీస్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తమిళ దర్శకుడు అట్లీ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. తాజాగా విడుదలయిన ‘బేబి జాన్’ మూవీ నుండి సల్మాన్ ఖాన్ క్యామియో సీన్ లీక్ అయ్యింది. సోషల్ మీడియాలో అప్పుడే ఈ ఎంట్రీ సీన్‌కు సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి.
కేవలం హిందీలో
‘బేబి జాన్’ (Baby John) సినిమాను ఎలాగైనా చాలామంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం టీమ్ అంతా కలిసి భారీగా ప్రమోషన్స్ చేసింది. ఈ మూవీ కేవలం హిందీలోనే విడుదల అవుతున్నా కూడా దేశమంతా చుట్టేస్తూ ‘బేబి జాన్’ను చూడమంటూ కోరారు మేకర్స్. ఇది కేవలం హిందీలోనే విడుదల అవ్వడం వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. ఇప్పటికే ఈ మూవీని తమిళ భాష నుండి రీమేక్ చేశారు. పైగా అది తెలుగులో కూడా డబ్ అయ్యింది. అంతే కాకుండా తెలుగులో ఈ మూవీని పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు. అందుకే హిందీలోనే ‘బేబి జాన్’కు భారీ హిట్ పడాలని మేకర్స్ కష్టపడ్డారు. ఆ కష్టానికి సల్మాన్ ఖాన్ కూడా సపోర్ట్ చేశాడు.
Also Read: యానిమల్ తో విధ్వంసం సృష్టించిన సందీప్ ఆస్తులు ఎన్ని కోట్లంటే..?
స్వయంగా ప్రకటించారు
మామూలుగా బాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో సినిమాలో మరొక స్టార్ హీరో నటించడం చాలా కామన్. అలాగే వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘బేబి జాన్’లో నటించడానికి కూడా సల్మాన్ ఖాన్ వెనకాడలేదు. పైగా సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో క్యామియో చేశాడని మూవీ టీమ్ స్వయంగా ప్రకటించి ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ చేశారు. అందుకే అసలు ‘బేబి జాన్’లో సల్మాన్ ఎంట్రీ ఎలా ఉండబోతుందా అని భాయ్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇంతలోనే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటికొచ్చాయి.
ఆ సీన్‌తో ఎంట్రీ
‘బేబి జాన్’లో ఒక ఫైట్ సీన్‌తో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఎంట్రీ ఉండబోతుందని అర్థమవుతుంది. ఆపదలో ఉన్న వరుణ్ ధావన్ (Varun Dhawan) ఫ్యామిలీని కాపాడడం కోసం సల్మాన్ ఎంట్రీ ఇస్తాడు. అంతే కాకుండా ఈ యాక్షన్ సీన్ సినిమాలో మరింత స్పెషల్‌గా ఉంటుందని ‘బేబి జాన్’ చూసిన ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ ధావన్, సల్మాన్ ఖాన్‌ను చూడడం బాగుందని బీ టౌన్ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి క్రిస్మస్ కానుకగా విడుదలయిన ‘బేబి జాన్’ మూవీ థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. ఇప్పటివరకు ప్రీమియర్స్, ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు మూవీ బాగుందని పాజిటివ్ రివ్యూ అందిస్తున్నారు.