BigTV English

Priyanka Gandhi: ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. మరో సారి మోదీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆరోపించారు. శనివారం గుజరాత్‌ లోని వల్సాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తారని మోదీ అంకుల్ చెప్పే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు.


రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోదీ కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలకు గానూ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీని బీజేపీ నేతలు శక్తివంతుడని పొగుడుతున్నారని అన్నారు. మోదీ చిటికె వేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగి పోతుందంటున్నారు..అలాంటప్పుడు మోదీ దేశ పేదరికాన్ని ఎందుకు తొలగించ లేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Also Read:ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంకా గాంధీ భర్త


తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో కీలక మార్పులు చేస్తామని బీజేపీ నేతలే స్వయంగా చెప్తున్నారని అన్నారు. దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణం మోదీ పరిపాలనా వైఫల్యం అని ఆరోపించారు. కేవలం సార్వత్రిక ఎన్నికల కోసమే ప్రధాని సిలిండర్ల ధరలను తగ్గించారని తెలిపారు. మోదీకి ప్రజలపై ఎలాంటి సానుభూతి లేదని విమర్శించారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×