Jr NTR : ఇండస్ట్రీలో సెలబ్రిటీలను వరస వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ (Allu Arjun) వివాదం నడుస్తుంటే, మరోవైపు సాయం చేస్తానన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేయలేదంటూ ఆయన అభిమాని కౌశిక్ తల్లి చేసిన కామెంట్స్ కొత్త రచ్చకు దారితీసాయి. తాజాగా ఆమె అలా ఎందుకు చేసిందో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ బిగ్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ (Jr NTR) కు కోట్లాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తన అభిమానులకు కష్టం వచ్చిందంటే ఆదుకోవడంలో ముందుంటారు. ‘దేవర’ (Devara) మూవీ రిలీజ్ కి ముందు క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ అభిమానికి ఇలాగే సాయం చేశారు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు బోన్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. అతను ఎన్టీఆర్ కు వీరాభిమాని కావడంతో, ‘దేవర’ సినిమాను చూసేవరకైనా సరే బ్రతికి ఉండాలని కోరుకుంటూ ఓ వీడియోను షేర్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ (Jr NTR) కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడి, అతనికి హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాడు. కానీ రీసెంట్ గా కౌశిక్ తల్లి ఎన్టీఆర్ తమకు ఎలాంటి సాయం చేయలేదని చెప్పి కొత్త వివాదానికి తెర తీసింది. ఎన్టీఆర్ కేవలం వీడియో కాల్ లో మాట్లాడడం తప్ప ఏం చేయలేదని ఆమె స్వయంగా మీడియాతో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కౌశిక్ తల్లిపై ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అయ్యారు.
కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆసుపత్రికి కట్టలేదు
చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంతా పూర్తి అయ్యాక ఫైనల్ బిల్లు రూ.60 లక్షలు అయింది
అందులో ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన రూ.51 లక్షలు కౌశిక్ తల్లి సరస్వతి ఆసుపత్రికి చెల్లించగా ఇంకో రూ.9 లక్షలు బిల్లు పెండింగ్ లో… pic.twitter.com/I36o7pTI3o
— BIG TV Breaking News (@bigtvtelugu) December 25, 2024
కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా సరే, ఆమె ఆసుపత్రికి కట్టలేదంటూ ప్రూఫ్ తో సహా సంచలన ఆరోపణలు చేశారు. చెన్నై ఆసుపత్రిలో ట్రీట్మెంట్ మొత్తం పూర్తయ్యాక ఫైనల్ బిల్లు 60 లక్షలు అయ్యిందని అన్నారు. అయితే అందులో ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన 51 లక్షలు కౌశిక్ తల్లి సరస్వతి ఆసుపత్రికి చెల్లించిందని, కేవలం 9 లక్షల బిల్లు పెండింగ్లో ఉందని ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులంతా ఇంకో 13 లక్షల పోగేసి కౌశిక్ తల్లికి ఇచ్చామని ఈ సందర్భంగా వెల్లడించారు. అందులోని 9 లక్షలు కట్టేసినా ఆమె దగ్గర ఇంకాస్త డబ్బు ఉండేదని, అలా డబ్బులు దగ్గర ఉన్నా సరే ఆమె ఎందుకు ఇలా మాట్లాడిందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు
తాము దగ్గర ఉండి ఆసుపత్రికి వెళ్లి, డిశ్చార్జ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి ఇంటికి పంపించామని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కౌశిక్ తల్లి ఇలా కామెంట్స్ చేయడానికి కారణం ఆమె పరిస్థితి. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక కూడా మరో రెండు మూడు నెలల ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఆ టైంలో డబ్బుల కోసం ఏం చేయాలి అన్న ఆలోచనతో ఆమె అలా చేసిందంటూ చెప్పుకోచ్చారు.