MLA Chintamaneni Prabhakar: ఆ ఎమ్మేల్యే రూటే సపరేట్. ఏ పని చేసినా ఏదొక వెరైటీ ఉండాల్సిందే. అయితే చేసే పనులు ఒక్కొక్కసారి, షాకుల మీద షాకులు ఇస్తుంటాయి. ఆ అధికార పార్టీ ఎమ్మేల్యేకు యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆయనెవరో కాదు దెందులూరు ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్. ఈ ఎమ్మేల్యే చేసిన పనికి అందరూ ఖంగుతిన్నారు. అందరూ అదే బాటలో నడిచేందుకు అడుగులు వేస్తున్నారట.
చింతమనేని ప్రభాకర్ అంటే తెలియని వారుండరు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడంలో ఎవరైనా ఈయన తరువాతే. ఎవరినైనా చింతమనేని విమర్శించారో, ఆ మాటలకు పదును కూడా ఎక్కువే. నిరంతరం సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచే ఈయన, తాజాగా చేసిన ఒక్క పనితో అందరినీ ఆలోచించేలా చేశారు. దెందులూరు నియోజకవర్గ ఎమ్మేల్యేగా ఉన్న చింతమనేనిని కలిసేందుకు, భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు వస్తుంటారు.
అలా వచ్చిన వారు ఊరికే వస్తారా చెప్పండి. వట్టి చేతులతో ఏం వెళ్తాం అంటూ శాలువాలు తీసుకొని వస్తారు. ఆ శాలువాలను స్వీకరించిన చింతమనేని కి ఓ ఐడియా వచ్చింది. ఇంట్లో గుట్టలుగా ఉన్న శాలువాలను ఏం చేయాలన్న ఆలోచన చేశారు చింతమనేని. ఇక అంతే ప్రజల కోసం తిరిగిచ్చేద్దాం బాస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ శాలువాలను టైలర్లకు అందించి డ్రస్సులు కుట్టాలని అందజేశారు.
ఒక్కొక్క డ్రస్సు కుట్టేందుకు రూ. 500 కాగా, ఆ డబ్బులు చెల్లించి డ్రస్సులు తయారు చేయించారు. అలా తయారు చేసిన డ్రస్సులను అనాథ పిల్లలకు, అనాధ శరణాలయాలకు అందించాలని నిర్ణయించారు. శాలువాలను డ్రస్సులుగా కుట్టడం పూర్తి కాగానే, సుమారు 1000 మంది చిన్నారులకు సరిపడా డ్రస్సులు రెడీ అయ్యాయి. దెందులూరు నియోజకవర్గంలో గల అనాధ శరణాలకు వాటిని ఎమ్మేల్యే అనుచరులు పంపించారు.
Also Read: YCP Party Protest: వైసీపీ పోరుబాట.. ప్రెస్‌మీట్లకు దూరంగా శ్యామల, ఏం జరిగింది?
ఇంకేముంది ఆ డ్రస్సులను చూసి చిన్నారులు మురిసిపోయారు. నాణ్యమైన శాలువాలను డ్రస్సులుగా కుట్టాలని ఆలోచన వచ్చిన ఎమ్మేల్యే చింతమనేనికి చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ప్రజలు ఇచ్చిన శాలువాలను డ్రస్సులుగా మార్చి, పిల్లలకు కానుకగా ఇవ్వాలన్న ఆలోచనకు హ్యాట్సాఫ్ ఎమ్మేల్యే గారూ.. అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.