BigTV English

IND vs Aus 4th test: తెలుగోడికి షాక్.. నాలుగో టెస్ట్ కు ఆడే టీమిండియా జట్టు ఇదే !

IND vs Aus 4th test: తెలుగోడికి షాక్.. నాలుగో టెస్ట్ కు ఆడే టీమిండియా జట్టు ఇదే !

IND vs Aus 4th test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య మేల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ లో తలపడేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. డిసెంబర్ 26 ఉదయం 5 నుండి ప్రారంభమయ్యే ఈ బాక్సింగ్ డే టెస్ట్ కోసం ప్రాక్టీస్ సెషన్ లో ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. ఈ టోర్నీలో భారత్ – ఆస్ట్రేలియా చెరొక విజయం సాధించాయి. మూడవ టెస్ట్ డ్రా గా మిగిలింది. దీంతో ఈ నాలుగోవ టెస్ట్ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని అటు ఆస్ట్రేలియా, ఇటు భారత జట్టు భావిస్తున్నాయి.


Also Read: Manu Bhaker: మ‌నూ భాక‌ర్ వివాదం ఏంటి… మోడీ ప్రభుత్వంపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు ?

అయితే ఈ నాలుగోవ టెస్ట్ కోసం టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగనుంది. మూడవ టెస్ట్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతని స్థానంలో కొత్త బౌలర్ కి అవకాశం కల్పించాలని భావిస్తోందట టీమిండియా మేనేజ్మెంట్. ఇక ఈ తుది జట్టులో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డికి షాక్ ఇవ్వబోతుందట మేనేజ్మెంట్. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ మ్యాచ్ కి భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనని అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోతున్న మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని ఈ నాలుగవ టెస్ట్ లో పక్కన పెట్టాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుందట. తొలి టెస్ట్ కి దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్ లలో పెద్దగా రాణించలేదు. రోహిత్ తన ఓపెనర్ స్థానాన్ని కేఎల్ రాహుల్ కి వదిలేసి మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నాడు.

అయితే ఇరుజట్లకు కీలకంగా మారిన ఈ బాక్సింగ్ డే టెస్ట్ కి రోహిత్ శర్మ మళ్ళీ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలిస్తేనే డబ్ల్యూటీసి ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండే పరిస్థితులలో.. తుది జట్టు ఎంపిక విషయంలో మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంటుందట. అందుకే బ్యాటింగ్ ఆర్డర్ లోను మార్పులు చేయాలని భావిస్తోంది. యశస్వి జైష్వాల్ తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తే.. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కి దిగుతాడు.

Also Read: IND-W vs WI-W: టీమిండియాలో మెరిసిన మరో అందాల తార.. ఆమె అందానికి కూడా !

ఇక నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదవ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ కి దిగితే.. ఆరవ స్థానంలో రవీంద్ర జడేజా, ఏడవ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తొలగించి ఆల్ రౌండర్ రూపంలో వాషింగ్టన్ సుందరికి అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా పటిష్టంగా మారుతుందని మేనేజ్మెంట్ భావిస్తుందట. ఈ బాక్సింగ్ డే టేస్ట్ కి ఇద్దరు స్పిన్నర్లను బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా తుది జట్టు అంచనా: (రోహిత్ శర్మ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×