Kayadu Lohar:కయ్యదు లోహర్ (Kayadu Lohar).. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ హీరోయిన్ గురించే మాట్లాడుకుంటోంది. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్డం సంపాదించింది కయ్యదు లోహర్. అలాంటి కయ్యదు లోహర్ కి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. చూస్తుంటే ఈ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) లాగే మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ కాబోతోంది కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు టాలీవుడ్ అభిమానులు. ప్రస్తుతం టాలీవుడ్ లో నెక్స్ట్ సినిమాలు తీయబోయే దర్శక నిర్మాతలు,హీరోలు అందరూ కూడా ఈ హీరోయిన్ నే తమ సినిమాలో ఫస్ట్ ఛాయిస్ గా తీసుకోవడానికి ఎగబడుతున్నారు. ఇటీవలే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)హీరోగా వచ్చిన తాజా మూవీ డ్రాగన్(Dragon)..అజయ్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కయ్యదు లోహర్ లు హీరోయిన్ లుగా నటించారు.
విశ్వక్ సేన్ మూవీలో డ్రాగన్ బ్యూటీ..
అయితే డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కంటే ఎక్కువ వైరల్ అయింది కయ్యదు లోహర్. ఈ హీరోయిన్ మలయాళం లో ఇప్పటివరకు ఐదారు సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు ఈ ఒక్క మూవీతో వచ్చిందని మాట్లాడుకుంటున్నారు.అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కంటే కయ్యదు లోహర్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుండడంతో ఈ హీరోయిన్ వెనక మన టాలీవుడ్ ఇండస్ట్రీ పడుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ హీరోయిన్ కి వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. అలా యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రాబోతున్న ఫంకీ(Funky) మూవీలో హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది. ఇదే కాదు కయ్యదు లోహర్ చేతిలో ప్రస్తుతం అధర్వ హీరోగా నటిస్తున్న ‘ఇదయం మురళి’ సినిమా కూడా ఉంది. అలా మరికొద్ది రోజుల్లో ఈ హీరోయిన్ చేతినిండా టాలీవుడ్ హీరోల సినిమాలు ఉండడం పక్కా అని, ఈమె యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయిన టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.ఇక అస్సామీ అమ్మాయి అయినటువంటి కయ్యదు లోహర్ గతంలో తెలుగులో శ్రీ విష్ణు(Sri Vishnu) తో ‘అల్లూరి’ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ద్వారా కయ్యద్ లోహర్ కి అంతగా గుర్తింపు రాలేదు.
డ్రాగన్ తో భారీ గుర్తింపు..
ఇక ఎప్పుడైతే ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీ విడుదలైందో.. ఈ సినిమా చూసినప్పటినుండి కయ్యదు లోహర్ కి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ టుడే (Love Today) సినిమా ద్వారా ఇవానా (Ivana) ఎంత ఫేమస్ అయిందో.. డ్రాగన్ సినిమా ద్వారా కయ్యదు లోహర్ కూడా అంతే ఫేమస్ అయింది. చూస్తుంటే ఈ హీరో కొత్త హీరోయిన్లకు అదృష్టంలా పట్టుకున్నారు అని కొంతమంది నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పపటికి కయ్యదు లోహర్ కి సినిమా ఛాన్స్ లు ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్ లు అందర్నీ పక్కనపెట్టి కయ్యదు లోహర్ స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అంటున్నారు.
Star Heroine: మీరెక్కడ తయారయ్యార్రా.. కనీసం పూజ కూడా చేసుకోనివ్వరా..?