BigTV English

Army plane crash: ఇంటిపై కూలిన విమానం.. స్పాట్‌లోనే 46 మంది..

Army plane crash: ఇంటిపై కూలిన విమానం.. స్పాట్‌లోనే 46 మంది..

Army plane crash: సూడాన్ లో ఘోర విమానం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 46 మంది మృతిచెందారు. పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. టేకాఫ్ అయిన కాసేపటికే సైనిక విమానం కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా కర్రారి జిల్లాలో ఓ ఇంటిపై విమానం కూలిపోయిందని అక్కడి మిలటరీ అధికారులు తెలిపారు. అయితే, మృతుల్లో సైనికులతో పాటు, సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


ALSO READ: Indian Army Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోనే రూ.56,100 వేతనం

ప్రమాదంలో మొత్తం 46 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. పది మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సుడాన్ మీడియా తెలిపింది. రంగంలోకి దిగిన సిబ్బంది సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


దాదాపు రెండేళ్ల నుంచి సూడాన్ లో అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి సుడాన్ మిలిటరీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్- ఆర్ఎస్ఎఫ్ దళాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగున్నాయి. ఈ యుద్ధం కారణంగానే అక్కడి పట్టణ ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. సూడాన్ లో సామూహిక అత్యాచారాలు, జాతిపరంగా ప్రేరేపితమైన హత్యలు, సామాన్యులకు భద్రత లేకుండా దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఐక్య రాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఇవి యుద్ధ నేరాలు, మానవాళిపై నేరాలని చెప్పుకొచ్చాయి. ఈ యుద్దాలు, సామూహిక అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా వెస్ట్ సూడన్ లోని డార్ఫర్ ప్రాంతంలో జరుగుతున్నాయని పేర్కొన్నాయి.

ALSO READ: Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ 9ఏ వివరాలు లీక్.. ఈ కిర్రాక్ ఫోన్ ధర ఎంత ఉండొచ్చంటే..?

ఇటీవల ఈ యుద్దాలు, హత్యలు ఎక్కువ అవ్వడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్ఎస్ఎఫ్ దళాలపై సూడాన్ మిలిటరీ అటాక్ చేస్తోంది. డార్ఫర్ వెస్ట్ ప్రాంతంలో  ఎక్కువ భాగాన్ని నియంత్రించే ఆర్ఎస్ఎఫ్, నైలా ప్రాంతంలో తాము ఓ సైనిక విమానాన్ని కూల్చివేసినట్టు ప్రకటించడం గమనార్హం.

Related News

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

Big Stories

×