PM Modi Warning: ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకేను భారత్ కు అప్పగించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు.
పాక నుంచి కాల్పులు జరిపితే.. ఊరుకునేది లేదని తిరిగి భారత్ తిరిగి కాల్పులు జరుపుతోందని ప్రధాని తేల్చి చెప్పారు. పీవోకే విషయంలో మధ్య వర్తులు అవసరం లేదని అన్నారు. పాక్ దాడులకు దిగితోందని.. ఇలానే కంటిన్యూ చేస్తే పాక్ తీవ్ర పరిణామాలు చూస్తుందని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పీవోకేను, టెర్రరిస్టులను భారత్ అప్పగించాలని.. ఈ విషయంలో వేరే ఏ దేశం జోక్యం అవసరం లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.
పీవోకే విషయంలో భారత్ వైఖరి మారదు..
‘పాక్ దాడులు జరిపితే.. భారత్ అంతకు మించి దాడులు జరుపుతోంది. అటు నుంచి తుపాకీ గుళ్లు వస్తే.. ఇటు నుంచి మిసైల్స్ అటాక్ చేస్తాయి. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే. పీవోకేను అప్పగించండం మినహా.. పాక్ కు ఇంకో గత్యంతరం లేదు’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ఓడిపోయింది..
ఇండియన్ ఆర్మీ చేసిన దాడులతో పాకిస్థాన్ పూర్తిగా ధ్వంసమైందని ప్రధాని మోదీ వెల్లడించారు. మనం చేసే యుద్ధంలో ప్రతి రౌండ్ లో పాక్ ఓడిపోయిందని తెలిపారు. దాయాది ఎయిర్ బేస్ లపై భారత్ చేసిన దాడులతో వాళ్లు అసలు యుద్ధంలోనే లేరనే విషయం అర్థమైందని ప్రధాని ఎద్దేవా చేశారు. దాడుల తర్వాత పాకిస్థాన్ కు గట్టి సందేశం ఇచ్చామని ప్రధాని మోదీ అభిప్రాపడ్డారు.
Also Read: Pak Drone Attack: మళ్లీ భారత్‌పై పాక్ అటాక్..? ఎంతవరకు నిజం?