BigTV English

Kayadu Lohar: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్

Kayadu Lohar: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్

Kayadu Lohar: ఒక్క సినిమాలో నటించగానే యంగ్ హీరోయిన్స్ చాలావరకు యూత్‌కు క్రష్‌గా మారిపోతున్నారు. కొన్నిసార్లు సినిమా హిట్ అవ్వకపోయినా హీరోయిన్స్ మాత్రమే హైలెట్ అవుతున్నారు. ఇక సినిమా హిట్ అయ్యిందంటే కొత్త హీరోయిన్లకు వచ్చే స్టార్‌డమ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ప్రస్తుతం ‘డ్రాగన్’ ఫేమ్ కాయదు లోహర్ కూడా అదే స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కాయదు లోహర్ ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. అందుకే సౌత్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా ఒక తమిళ యంగ్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట ఈ ముద్దుగుమ్మ.


హీరోయిన్‌గా ఫిక్స్

‘డ్రాగన్’ రిలీజ్ తర్వాత కాయదు లోహర్‌కు ఆఫర్లు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లతో ఒక్కసారిగా బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తమిళంలో ‘ఇదయం మురళి’ అనే మూవీ షూటింగ్‌ను పూర్తి చేసి దాని రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. దాంతో పాటు తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘ఫంకీ’లో కూడా కాయదునే హీరోయిన్ అని సమాచారం. ఇక వీటితో పాటు మరెన్నో ప్రాజెక్ట్స్‌లో కూడా కాయదు లోహర్‌ (Kayadu Lohar)ను క్యాస్ట్ చేయడానికి మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కోలీవుడ్ యంగ్ హీరో అయిన శింబు అప్‌కమింగ్ మూవీలో కాయదు హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్టు తమిళ పరిశ్రమలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


రేంజ్ పెరిగింది

శింబు తన కెరీర్‌లో హీరోగా 49వ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని రామ్‌కుమార్ బాలకృష్ణన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘ఎస్‌టీఆర్ 49’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా నటించడానికి కాయదు లోహర్ సైన్ చేసినట్టుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తను ప్రదీప్ రంగనాథన్, అధర్వ లాంటి యంగ్ హీరోలతోనే నటించింది. మొదటిసారి శింబు లాంటి స్టార్ హీరో సరసన సినిమా ఫైనల్ అవ్వడంతో దీని తర్వాత కోలీవుడ్‌లో కాయదు లోహర్ రేంజ్ మరింత పెరిగిపోతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నా ఈ మూవీ.. ఏప్రిల్ నుండి షూటింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం.

Also Read: ఏకంగా స్టార్ హీరోతో రొమాన్స్‌కు సిద్ధమయిన ప్రేమలు బ్యూటీ.. లక్ మామూలుగా లేదుగా.!

అలాంటి పాత్రలో

‘ఎస్‌టీఆర్ 49’లో శింబు (Simbu) ఒక ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో పాపులర్ కమెడియన్ అయిన సంతానం కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. అంతే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా సాయి అభ్యంకర్ పేరు పరిగణిస్తోందట మూవీ టీమ్. కొత్త పెయిర్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి క్యాస్టింగ్.. ఇదంతా చూసి ‘ఎస్‌టీఆర్ 49’పై ప్రేక్షకులు ఇప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభించుకొని డిసెంబర్‌లోనే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారట. దీంతో అసలు ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×