Trump – Education Department : అమెరికాలో రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి వివిధ శాఖల్లో ఉద్యోగాలపై కోతలు విధిస్తున్న ట్రంప్.. తాజాగా విద్యా శాఖపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ శాఖలో ఇప్పటికే భారీగా ఉద్యోగులను తొలగించిన ట్రంప్ సర్కార్.. మిగతా వారిని కూడా తీసేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు.. అమెరికా అధ్యక్ష కార్యాలయంతో పాటుగా విద్యా శాఖ మంత్రి లిండా మెక్ మాన్ అనేక సందర్భాల్లో తెలుపుతూనే ఉన్నారు. త్వరలోనే విద్యాశాఖను మూసేసే కార్యనిర్వహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఫెడరల్ నిధులతో నడుస్తున్న విద్యాశాఖను పూర్తిగా రద్దు చేసి రాష్ట్రాలకు అప్పగించాలని ట్రంప్ కార్యవర్గం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే.. చాలా వరకు కార్యచరణ చేశారు కూడా. విద్యాశాఖ ఉదార భావజాలంతో పూర్తిగా కలుషితం అయ్యిందని భావిస్తున్న ట్రంప్.. ఇతర దేశాలలోని పాఠశాలలతో పోలిస్తే అమెరికా ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఏమంత మెరుగ్గా లేదని అంటున్నారు. విద్యాప్రమాణాల విషయంలో వెనుకబడి ఉన్నామంటున్న ట్రంప్.. సగటున ఒక్కో విద్యార్థిపై చేస్తున్న ఖర్చు విషయంలో మాత్రం ముందున్నామంటూ ఆగ్రహిస్తున్నారు.
ఓవైపు విద్యాశాఖను మూసేసినా.. అమెరికా ప్రజలకు అందుతోన్న సేవల్లో అంతరాయం కలుగకూడదని యంత్రాంగానికి ట్రంప్ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ట్‌హౌస్ ఫ్యాక్ట్‌షీట్‌లోని అంశాలను ఆధారంగా చేసుకుని అంతర్జాతీయ మీడియా అనేక అంశాల్ని బహిర్గతం చేస్తోంది. వాటిలో.. వైట్ హౌస్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల రిపబ్లికన్ గవర్నర్లు, రాష్ట్ర విద్యా కమిషనర్లు హాజరవ్వనున్నారు. ఆ సమయంలోనే విద్యా శాఖకు సంబంధించిన కార్యనిర్వహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Trump World Center: ఇండియాలో ట్రంప్ వరల్డ్ సెంటర్.. ఏ సిటీలో ఏర్పాటు
అమెరికాలో ఫెడరల్ విద్యాశాఖను 1979లో కాంగ్రెస్ ద్వారా క్యాబినెట్ స్థాయి ఏజెన్సీగా స్థాపించారు. దీనిని పూర్తిగా మూసివేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుందని చెబుతున్నారు. ట్రంప్ సంతకం చేసిన వెంటనే విద్యాశాఖను పూర్తిగా మూసివేయడం కుదరదు అని చెబుతున్నారు. దీన్ని తొలగించాలంటే కాంగ్రెస్ చర్య తీసుకోవలసి ఉంటుందని అంటున్నారు.
ఎలోన్ మస్క్ ప్రభుత్వ సమర్థత విభాగం – డోజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక విభాగాల్లోని ఉద్యోగుల్లో కోతలు విధిస్తున్నారు. ఇప్పటికే.. అంతర్జాతీయంగా వివిధ పనుల్లో ఉన్న యూఎస్ ఎయిడ్ సంస్థను పూర్తిగా రద్దు చేసిన ట్రంప్.. మిగతా అనేక ప్రభుత్వ విభాగాల్లోనూ కోతలు విధిస్తున్నారు. విద్యాశాఖలోనూ గత వారం 1,300 మందికి పైగా ఉద్యోగులకు తొలగింపు నోటీసులు అందించారు. ఇక ఇప్పుడు మరింత మంది ఉద్యోగుల్ని తీసేసేందుకు.. ఈ ఉత్తర్వు జారీ చేశారు.
ప్రభుత్వం సూచించిన స్వచ్ఛంద పదవీ విరమణ కారణాలతో విద్యాశాఖ నుంచి 600 మంది రాజీనామా చేశారు. ఇలా.. ట్రంప్ పరిపాలన రెండో పదవీకాలం ప్రారంభమైనప్పటి నుంచి.. ఈ శాఖలోని మొత్తం 4,133 మంది ఉద్యోగుల నుంచి 2,183 మంది కార్మికులకు తగ్గారు. తగ్గించింది.
Also read : Trump H1B Visa: హెచ్-1బీ వీసాలో కీలక మార్పులు.. ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం