Hero Roshan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి జాతకం అయినా ఒక శుక్రవారం మార్చేస్తుంది అని చెబుతూ ఉంటారు. అలానే ఎవరి కెరియర్ అయినా ఒక శుక్రవారం దిగిపోతుందని కూడా చెప్పొచ్చు. ప్రతి హీరోకి ఉండే హిట్టు ప్లాప్ బట్టి వాళ్ల కెరియర్ డిసైడ్ అవుతుంది. ఒక సినిమా ఫ్రైడే సూపర్ హిట్ అయింది అంటే వరుసగా అవకాశాలు వస్తూనే ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ థియేటర్ కి రావడం తగ్గించేశారు అని పలు రకాల కామెంట్స్ వినిపిస్తూ వస్తూ ఉంటాయి. కానీ నిజంగా ఒక సరైన హిట్ సినిమా పడితే అభిమానులు ఆ సినిమాను విపరీతంగా ఆదరిస్తారు అనడంలో సందేహం లేదు. ఎన్నో చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించి కంటెంట్ బలం ఏంటో చూపించాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన సినిమా కోర్ట్. వాల్ పోస్టర్ సినిమాపై ఈ సినిమాను నాని సిస్టర్ నిర్మించారు. ఈ సినిమాకి మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ లభించింది.
ఒక సినిమా హిట్ అయింది అంటే సోషల్ మీడియాలో దాని గురించి పలు రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. సినిమా బాగా నచ్చితే పదిమంది చూడండి అని పోస్టులు కూడా వేస్తారు. అలానే నచ్చకపోతే ఈ సినిమా ఎలా నచ్చింది అని ట్రోల్ కూడా చేస్తారు. అయితే అన్ని సినిమాలు అందరికీ నచ్చాలి అని రూల్ లేదు. ఇకపోతే రీసెంట్గా రిలీజ్ అయిన కోర్టు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించి మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. కేవలం మల్టీప్లెక్స్ లోనే కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే దాదాపు 30 కోట్లకు పైగా ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చాయి. కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా ఈ సినిమా హీరో రోషన్ అవకాశాలు కూడా వస్తున్నాయి. రోషన్ హీరోగా శివాజీ కీలక పాత్రలో దిల్ రాజు ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు విశ్వసనీ వర్గాల సమాచారం. ఈ సినిమాతో రమేష్ అనే ఒక కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి తెల్ల కాగితం అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.
సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కృష్ణ మరియు దిల్ రాజ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. తెలుగు ఆడియన్స్ ఒక మంచి సినిమాను ఎప్పటికీ ఆదరిస్తారు అని పలుమార్లు రుజువు అవుతూ వచ్చింది. ఇప్పుడు కోర్టు సినిమా కూడా మంచి సినిమాలకు ఆదరణ లభిస్తుంది అని ప్రూవ్ చేసింది. సీనియర్ నటుడు శివాజీకి ఈ సినిమా మంచి స్ట్రాంగ్ కం బ్యాక్ అయింది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శివాజీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు.
Also Read : Thaman : తమన్ స్టేట్మెంట్ కి మద్దతుగా సిద్దు జొన్నలగడ్డ