Keerthi Suresh: ఎట్టకేలకు మహానటి కీర్తి సురేష్ (Keerthi Suresh)ఏడడుగులు వేయబోతోంది.తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ (Antony tattil) తో ఏడడుగులు వేయడానికి సిద్ధం అయ్యింది. అంతేకాదు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్, ఆంటోని ఎప్పుడు వివాహం చేసుకోబోతున్నారు..? ఎక్కడ వీరి వివాహం జరగబోతోంది..? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు. ఇక దీనిపై కూడా ఆమె స్వయంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.
గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్..
శుక్రవారం రోజు తిరుమలలో సందడి చేసింది కీర్తి సురేష్. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. “తన కొత్త చిత్రం అయినా ‘బేబీ జాన్’ తోపాటు వచ్చే నెలలో తన పెళ్లి కూడా ఉంది కాబట్టి దర్శనం కోసం వచ్చాను” అంటూ తెలిపింది. ఇక పెళ్లి ఎక్కడ? అని అడిగితే.. గోవాలో అని, అది కూడా చాలా సింపుల్ గా ,వచ్చేనెల వివాహం జరగబోతోంది అంటూ అందరికీ చెప్పి, తన పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేష్. ఏదేమైనా వచ్చే నెల , అందులోనూ గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతోంది అని తెలిసి అభిమానులు సైతం సంబరపడిపోతున్నారు.
కీర్తి సురేష్ కెరియర్..
ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ఒకప్పుడు సాంప్రదాయంగా కనిపించిన ఈమె, బాలీవుడ్ కి వెళ్లడానికి గ్లామర్ డాల్ గా మారిపోయిన విషయం తెలిసిందే. తన అందచందాలతో గ్లామర్ ఒలకబోస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్లో అవకాశాలు అందుకొని బిజీగా మారిపోయింది. సౌత్ లో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు కానీ బాలీవుడ్ లో బిజీగా మారినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా చేయడం లేదు అని చెప్పవచ్చు. నాని (Nani ) హీరోగా నటించిన ‘దసరా’ సినిమాతో డీ గ్లామర్ పాత్ర పోషించి, తనను తాను ప్రూవ్ చేసుకుంది. అయినా సరే ఈమెకు మాత్రం అవకాశాలు రావడం లేదు.
వరుస ప్లాప్ లతో..
ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేష్.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి బొక్క బోర్ల పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కరోనా సమయంలో ‘మిస్ ఇండియా’, ‘పెంగ్విన్’ ‘గుడ్ లక్ సఖి’ అంటూ వరుసగా చిత్రాలు చేసి బోల్తా కొట్టిన ఈమెకు, సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చివరిగా తెలుగులో చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘భోళాశంకర్’ సినిమాలో చిరంజీవి చెల్లిగా నటించింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే ఈమె ఖాతాలో ఎక్కువగా ఫ్లాప్ లు పడ్డాయని చెప్పవచ్చు.
తమిళ్, హిందీ చిత్రాలతో బిజీగా మారిన కీర్తి సురేష్..
ప్రస్తుతం తమిళంలో అవకాశాలు అందుకుంటున్న ఈమె ఇప్పటికే రెండు తమిళ్ చిత్రాలను లైన్ లో పెట్టింది. ఒకటి రివాల్వర్ రీటా , మరొకటి కన్నివేది.. తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది కానీ కానీ తెలుగులో మాత్రం అవకాశాలు రావడం లేదని సమాచారం. ఇకపోతే ఇటీవల ‘రఘు తాత’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది.. ఇక ఇప్పుడు ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది ఈ ముద్దుగుమ్మ.