Children Social Media Ban| ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తో పిలల్లు, టీనేజర్లు టీనేజర్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రపంచవ్యప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం 2025 ద్వితీయార్థంలో అమలులోకి రానుందని సమాచారం. అయితే ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేస్తారు. ఇది సాధ్యమేనా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. టిక్ టాక్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్స్ లాంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నీ 16 ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకు తమ ప్లాట్ ఫామ్స్ వినియోగానికి అనుమతించకూడదు. వారిని బ్లాక్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి లేదా AUD 50 మిలియన్ డాలర్లు (రూ. 271 కోట్లు) వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే యూట్యూబ్ లో ఎడుకేషన్ కంటెంట్ ఉండడంతో ఆ ఒక్క కారణంగా మినహాయింపు లభించింది. అయితే ఇంతవరకు ఈ చట్టాన్ని ఎలా అమలు పరచాలనేది చెప్పలేదు. దీనికోసం జనవరి నుంచి మార్చి 2025 వరకు ట్రయల్స్ చేపట్టనున్నారు.
Also Read: 3 నెలల్లో 35 లక్షలు సంపాదించిన పెళ్లికూతరు.. ఏజెన్సీతో కలిసి మోసం చేయడమే పని
ఈ ట్రయల్స్ కోసం ఆస్ట్రేలియాలోని 1200 మంది రాండమ్ గా ఎంచుకొని వారితో ప్రయోగం చేస్తారు. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన ఎన్నికలు, డిఫెన్స్ ప్రాజెక్ట్స్ చేసిన అనుభవమున్న కెజెఆర్ టెక్నాలజీ కంపెనీకి ఈ చట్టం అమలు చేసే బాధ్యతలు అప్పగించిందని రాయిటర్స్ మీడియా తెలిపింది. దీనికోసం యూజర్ల నుంచి వారి ప్రైవేట్ డేటా తసుకోకుండా వారి ప్రైవేసీ, సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇస్తూ.. వారికి సోషల్ మీడియా యాక్సెస్ ఇచ్చే మార్గాలను అన్వేషిస్తున్నట్లు కెజెఆర్ సంస్థ ప్రతినిధి తెలిపారు.
పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ఎలా?
ఇప్పటికైతే యూజర్ల బయోమెట్రిక్ డేటా ద్వారా వారి వయసు నిర్ధారణ చేసే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా యూజర్ తన వీడియో సెల్ఫీ అప్ లోడ్ చేయగానే అతని ముఖాన్ని టెక్నాలజీ ద్వారా పరిశీలిస్తారు. ఆ తరువాత ఈ డేటా డిలీట్ అయిపోతుంది. లేదా పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక థర్డ్ పార్టీ ద్వారా చేయిస్తారు. ఫేక్ డాక్యుమెంట్స్ లేదా వీడియో సెల్ఫీలో మోసాలన నివారించడానికి ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా చేపడతారని సమాచారం. ఈ ఏజ్ చెకింగ్ ప్రక్రియ కోసం బ్రిటీష్ కనస్టింగ్ కంపెనీ అయిన ‘ఏజ్ చెక్ సర్టిఫికేషన్ స్కీమ్’ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఏజ్ చెకింగ్ కోసం యూజర్ ఫ్రెండ్లీ టెక్నాలజీని ఉపయోగిస్తామని ‘ఏజ్ చెక్ సర్టిఫికేషన్ స్కీమ్’ కంపెనీ తెలిపింది.
ఈ ట్రయల్స్ పూర్తయ్యాక ప్రభుత్వం, సోషల్ మీడియా కంపెనీలు చట్టంలో నిబంధనలు అప్డేట్ చేస్తారు.
సోషల్ మీడియా వ్యసనం వల్ల పిల్లలు, టీనేజర్లు తమ జీవితాలన నాశనం చేసుకుంటున్నారు. చాలామంది మానసిక రోగులుగా మారుతుంటే.. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఘటనలతో ప్రపంచ దేశాలు సోషల్ మీడియా వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాతోపాటు కొన్ని యూరోపియన్ దేశాలు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించాయి. కానీ ఎక్కడా అవి పూర్తిగా అమలు కావడం లేదు.
ఒకవేళ ఆస్ట్రేలియా ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే.. మిగతా ప్రపంచదేశాలు ఆస్ట్రేలియాను అనుసరిస్తాయనడంలో సందేహం లేదు.