Venky Atluri – Suriya:ఈమధ్య కాలంలో వివిధ భాష ఇండస్ట్రీకి చెందిన హీరోలు.. ఇతర ఇండస్ట్రీలలో కూడా తమ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇతర భాష ఇండస్ట్రీలకు చెందిన స్టార్ డైరెక్టర్లను ఎంపిక చేసుకొని మరీ వారితో అదే భాషలో నేరుగా సినిమాలు చేస్తూ.. ఆ భాషా ఇండస్ట్రీ ప్రేక్షకులకు పరిచయమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ దర్శకులతో జతకడుతుంటే.. అటు కోలీవుడ్ హీరోలు ఇటు టాలీవుడ్ హీరోలతో జత కడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ అట్లీ(Atlee ) డైరెక్షన్లో అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా చేస్తుండగా.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri)దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా సినిమా చేస్తున్నారు.
వెంకీ – సూర్య కాంబోలో ఛాన్స్ దక్కించుకున్న కీర్తి సురేష్..
మరోవైపు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అగ్ర హీరో సూర్య (Suriya) చేయబోతున్న సినిమా మారుతీ కార్లకు సంబంధించిన నేపథ్య కథాంశంతో తెరకెక్కబోతోందని సమాచారం. ‘796సీసీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించగా.. ఇప్పుడు ఫైనల్ గా ‘మహానటి’ పేరును ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం . ప్రస్తుతం ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. మే రెండవ వారం నుంచి సినిమా షూటింగ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో సూర్య సరసన మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh)ను ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే అమ్మడి అదృష్టం మామూలుగా ఉండదని, నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
కీర్తి సురేష్ సినిమాలు..
కీర్తి సురేష్ విషయానికి వస్తే.. ప్రముఖ మలయాళ నటి మేనక (Menaka ) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించి అబ్బురపరిచింది. తల్లి అందాన్ని ఉనికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. అందంతోపాటు నటనతో కూడా మెప్పించింది. అలా తొలిసారి ‘నేను శైలజా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్.. మొదటి సినిమాతోనే అలరించింది. తర్వాత ప్రముఖ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో మహానటి సావిత్రి (Mahanati Savitri) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో తన నటనను ప్రూవ్ చేసుకొని రికార్డ్ సృష్టించింది. అంతేకాదు మహానటి సినిమాతో ఏకంగా జాతీయస్థాయి అవార్డును కూడా సొంతం చేసుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈమె నాని (Nani ), శ్రీకాంత్ ఓదెల (Srikanth odala) కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ సినిమాలో దీ గ్లామరస్ పాత్ర పోషించి ఆకట్టుకుంది. ముఖ్యంగా తన క్యారెక్టర్ తో అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఇక తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్ చిత్రాలతో కూడా అలరించిన కీర్తి సురేష్.. ఇటీవలే బాలీవుడ్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడితో వివాహం జరిగిన తర్వాత అక్కడ ‘బేబీ జాన్’ అనే సినిమాను రిలీజ్ చేసింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు రాగా అంతలోనే కీర్తి సురేష్.. సూర్య సరసన ఎంపిక కాబోతోంది అని సమాచారం.