Colin Munro on Iftikhar : ఇస్లామాబాద్ యునైటేడ్, ముల్తాన్ సుల్తాన్ ల మధ్య 2025 పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ నిన్న రాత్రి జరిగింది. అయితే ఈ లీగ్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బౌలర్ ఇప్తికార్ అహ్మద్ తిట్టాడు బ్యాటర్ మున్రో. బౌలింగ్ యాక్షన్ అనుమానంగా ఉందని.. ముఖం మీదే చెప్పేశాడు.ఈ మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్ టీమ్ కి చెందిన బౌలర్ ఇఫ్తికార్ అహ్మద్ అక్రమ బౌలింగ్ చేశాడని ఇస్లామాబాద్ యునైటేడ్ బ్యాట్స్ మెన్ కొలిన్ మున్రో ఆరోపించాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ లో ఇప్తికార్ వేసిన పదునైనా యార్కర్ తో ఈ ఘటన చోటు చేసుకుంది. మున్రో.. ఆఫ్ స్పిన్నర్ ఇఫ్తికార్ వేసిన బంతులపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. క్రికెట్ చట్టంగా నిర్ణయించబడినటువంటి 15 డిగ్రీల మోచేతి పొడగింపు పరిమితిని మించిపోయిందని తెలిపాడు. అపైర్ వద్దకు వెళ్లకుండా మున్రో నేరుగా ఇఫ్తికార్ తో గొడవ పడ్డాడు. దీంతో మైదానంలో వాగ్వాదం చోటు చేసుకుంది.
Also Read : Bumrah Inhuman Act: బుమ్రాకు మానవత్వం లేదు మ్యాచ్‌లో అలాగేనా ప్రవర్తించేది.. నెటిజెన్లు ఫైర్
ఇక మ్యాచ్ అధికారులు ముల్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ పరిస్థితిని దిగజార్చడానికి వేగంగా అడ్డుకున్నారు. అంపైర్లు ఆటను నిలిపివేయకూడదని.. ఆరోపణకు సంబంధించి తక్షణ చర్య తీసుకోకూడదని నిర్ణయించుకున్నందున రిజ్వాన్ మున్రో ని బ్యాటింగ్ కొనసాగించమని కోరాడు. ఇలా వివాదం కొనసాగుతున్నప్పటికీ మున్రో ఇన్నింగ్స్ ఇస్లామాబాద్ విజయవంతమైన ఛేజింగ్ కి పునాది వేసింది. మున్రో 28 బంతుల్లో చురుకైన 45 పరుగులు చేశాడు. ఈ వాగ్వాదం తరువాత మైఖేల్ బ్రేస్ వెల్ కొద్ది సేపటికే ఔట్ అయ్యాడు. ఇఫ్తికార్ క్యాచ్ అందుకున్నాడు. ఓపెనర్ ఆండ్రీస్ గౌడ్ కేవలం 45 బంతుల్లో అజెయంగా 80 పరుగులు చేశాడు. డిపెండింగ్ ఛాంపియన్ ని 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటేడ్ జట్టు 17 బంతులు మిగిలి ఉండగానే 171 పరుగులు చేసింది. అంతకు ముందు ముల్తాన్ సుల్తాన్ జట్టు 168 పరుగులు చేసింది.
ఉస్మాన్ ఖాన్ 40 బంతుల్లో 61 పరుగులు చేయగా.. రిజ్వాన్ 36 పరుగులతో స్లోగా ఆడాడు. ఇక ఇఫ్తికార్ బ్యాట్ తో 10 పరుగులు చేశాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. వికెట్ తీయకుండా 20 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్ విజయంతో ఇస్లామాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముల్తాన్ సుల్తాన్లు మాత్రం కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించి అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. పీఎస్ఎల్ మ్యాచ్ ల్లో మాత్రం వరుసగా గొడవలు జరగడం విశేషం. ఇటీవలే బౌలర్ ఉబైద్ షా తన సహచరుడు వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ను కొట్టిన విషయం తెలిసిందే. అనుకోకుండా కీపర్ ఉస్మాన్ ఖాన్ తలపై తన అరచేతితో కొట్టడంతో కింద పడిపోయాడు. ఉస్మాన్ ఖాన్ హెల్మెట్ ధరించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. పీఎస్ఎల్ మ్యాచ్ లో రోజుకొక విచిత్ర సంఘటన జరగడం విశేషం. మొన్న భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ జెర్సీ ధరించి ఉండటం విశేషం. ఇలా ఏదో ఒక వివాదాస్పదన సంఘటనలు చోటు చేసుకుండటం గమనార్హం. ఇంతకు ముందు ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత పీఎస్ఎల్ జరిగేది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ కి పోటీగా పీఎస్ఎల్ తీసుకురావడం విశేషం.
Pakistanis are frustrated after the cancellation of Indus water treaty.🤡
pic.twitter.com/WU3woGJ1QI— Gems of Cricket (@GemsOfCrickets) April 23, 2025