BigTV English

IND vs Aus 3rd Test: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. గబ్బా టెస్టుకు 5 రోజుల పాటు వర్షం ముప్పు?

IND vs Aus 3rd Test: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. గబ్బా టెస్టుకు 5 రోజుల పాటు వర్షం ముప్పు?

IND vs Aus 3rd Test: టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. బోర్డర్ గవస్కార్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో భాగంగా….. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది టీమిండియా. ఈ టోర్నమెంట్లో భాగంగా…. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి. ఇప్పటికే ఐదు టెస్టుల్లో రెండు టెస్టులు పూర్తి అయ్యాయి. మొదటి టెస్ట్ పెర్త్ వేదికగా జరగగా…. ఆ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అన్ని విభాగాలలో టీమిండియా… అద్భుతంగా ఆడటంతో… గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది.


 

అయితే రెండవ టెస్టు ఆడే సమయానికి టీమిండియా కు ఎదురు దెబ్బ తగిలింది. రెండవ టెస్టులో టీమ్ ఇండియా పెద్దగా రాణించలేదు. మొదటి టెస్ట్ గెలిచిన గర్వంతో ఆడిన టీమిండియా…. రెండవ టెస్టులు దారుణంగా ఓడిపోయింది. ఫలితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంటు ను సమం చేసింది ఆస్ట్రేలియా. ఇక టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మరో మూడు టెస్టులు జరగనున్నాయి.


 

ఈ మూడు టెస్టుల్లో కచ్చితంగా టీమిండియా మూడు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్ బరిలో ఉండడం కష్టమే. టీమిండియా… కచ్చితంగా ఈ మూడు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ దిశగా కసరత్తులు చేస్తోంది టీమిండియా. అయితే ఇలాంటి నేపథ్యంలో… ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఎదురైంది. ఈ టోర్నమెంట్ మూడవ టెస్ట్ డిసెంబర్ 14వ తేదీన ప్రారంభం కానుంది. డిసెంబర్ 18వ తేదీ వరకు మూడవ టెస్ట్ కొనసాగనుంది.

 

అయితే ఈ టెస్ట్ కు భారీ వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐదు రోజులపాటు జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ కు… ప్రతిరోజు వర్షం అంతరాయంగా మారనుందట. ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో… మూడవ టెస్టు రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. బ్యాటింగ్కు దిగిన గంట తర్వాత… వర్షం కొట్టి మళ్ళీ ఆగిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయట.

 

అలాంటి పరిస్థితులు ప్రతిరోజు నెలకొనే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు వాతావరణ నిపుణులు. కాబట్టి మూడో టెస్టు నిర్వహణలో సందిగ్ధత నెలకొంది. ఇది ఇలా ఉండగా… బ్రిస్ బెన్ లో జరిగే ఈ మూడవ టెస్ట్ మ్యాచ్…ఉదయం ఐదున్నర గంటలకే ప్రారంభం కానుంది. ఇక వర్షం గురించి పక్కకు పెడితే… టీమిండియా ఈ మ్యాచ్ లో భారీ మార్పులతో బరిలోకి దిగే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి ని పక్కకు పెడతారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

 

మొదటి రెండు టెస్టుల్లో బ్యాటింగ్లో అదరగొట్టిన నితీష్ కుమార్… బౌలింగ్లో పెద్దగా రాణించలేదని కొంతమంది టీమిండియా సీనియర్లు భావిస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో మరొక బౌలర్ ను తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.  అలాగే హర్షిత్ రానా ను ఈ మ్యాచ్లో పక్కకు పెట్టే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

 

 

 

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×