Pawan Kalyan Security Guard House Attack Update: టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఉన్న ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. రాడ్లు, రాళ్లు, కత్తులతో దాడి చేశారు. దాడి ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అసలేం జరిగిందనే లోతుల్లోకి వెళ్తే…
హైదరాబాద్‌లోకి హీరో పవన్‌కల్యాణ్ ఇంటికి సెక్యూరిటీగా పని చేస్తున్నాడు వెంకట్ అనే వ్యక్తి. ఆయన తన భార్యతో కలిసి మీర్‌పేట్‌లోని లెనిన్‌నగర్ ఐదేళ్లుగా ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లులు కూడా. అయితే ఇంటికి ఎదురుగా ఉండే రాజు బంధువులతో పాత గొడవలు ఉన్నాయి.
ఇంటిముందు ఉండే ఓ అబ్బాయి.. వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంకట్ వైఫ్ సరిత జోక్యం చేసుకుని అబ్బాయిని వారించింది. ఇక్కడి నుంచి మొదలైన ఈ గొడవ, చినికి చినికి గాలి వానగా మారింది.
Also Read: రెండు వారాల్లో వర్షాకాలం.. మేడిగడ్డ పునరుద్ధరణ పనుల మాటేంటి ?
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వేళ రాజు బంధువులు వెంకట్ ఇంటిపై దాడి చేశాడు. కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అంతేకాదు వెంకట్ కుటుంబసభ్యులపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. వెంకట్ ఇంటిముందున్న బైక్‌ను డ్యామేజ్ చేశారు. దాన్ని తగల బెట్టడానికి సిద్ధమైన సమయంలో వెంకట్‌పైనా దాడికి యత్నించాడు. ఈలోగా స్థానికులు జోక్యం చేసుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మళ్లీ ఆ వ్యక్తులు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారేమోనని హడలిపోతోంది వెంకట్ ఫ్యామిలీ. ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Also Read: Chandrababu SPG increased : బాబుకు భద్రత పెంచిన కేంద్రం.. అందుకేనా?
హీరో పవన్ కల్యాణ్ హౌస్ సెక్యూరిటీగా పని చేస్తున్న వెంకట్ ఇంటిపై దాడి. నిన్న సాయంత్రం కర్రలు, ఇటుకలు,ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఎదురింట్లో ఉంటే రఘు కుటుంబం. వెంకట్ కుటుంబ సభ్యులపైనా దాడి. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్… pic.twitter.com/fP8S9pClFj
— BIG TV Breaking News (@bigtvtelugu) May 16, 2024