BigTV English
Advertisement

Bill Gates Kamala Harris: మస్క్‌కు వ్యతిరేంగా బిల్ గేట్స్.. కమలా హ్యారిస్‌ ప్రచారానికి 50 మిలియన్ డాలర్ల విరాళం!

Bill Gates Kamala Harris: మస్క్‌కు వ్యతిరేంగా బిల్ గేట్స్.. కమలా హ్యారిస్‌ ప్రచారానికి 50 మిలియన్ డాలర్ల విరాళం!

Bill Gates Kamala Harris| అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా మారాయి. ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ తమ బలాబలాలు ప్రదర్శిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్, డెమోక్రాట్స్ అభ్యర్థి కమలా హ్యారిస్ ఇద్దరివైపు బడా బిజినెస్ మెన్‌లు అండగా నిలబడ్డారు. ఇప్పటివరకు ట్రంప్ నకు మద్దతుగా ప్రముఖ బిలియనీర్ టెస్లా సిఈవో ఎలన్ మస్క్ ఉండగా.. తాజాగా కమలా హ్యారిస్ కు మద్దతుగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ముందుకు వచ్చారు.


అమెరికా ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ తాజా కథనం ప్రకారం.. డెమెక్రాట్స్ అభ్యర్థి కమలా హ్యారిస్ కు ఎన్నికల ప్రచారం నిర్వహించే ఫ్యూచర్ ఫార్‌వార్డ్ యుఎస్ఎ యాక్షన్ సంస్థకు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ 50 మిలియన్ డాలర్లు (5 కోట్ల డాలర్లు) విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం కొన్ని రోజుల క్రితమే బిల్ గేట్స్ అందించగా.. దీని గురించి బహిరంగంగా ఆయన ప్రకటించలేదు. పైగా ఫ్యూచర్ ఫార్వర్డ్ సంస్థ నియమాల ప్రకారం.. ఎన్నికల ప్రచారానికి భారీ విరాళాలు అందించే ప్రముఖుల పేర్లు కూడా బహిర్గతం చేయకూడదు. కానీ కమలా హ్యారిస్ మద్దతుదారుల జాబితాని న్యూ యార్క్ టైమ్స్ బట్టబయలు చేసింది.

Also Read: ‘డైలీ ఒకరికి రూ.8 కోట్లు ఇస్తా’.. అమెరికా ఎన్నికల ప్రచారంలో మస్క్ సంచలన ప్రకటన


నవంబర్ 5, 2024న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనుండగా.. బిల్ గేట్స్ ఈ ఎన్నికలు చాలా కీలకమని చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంలో బిల్ గేట్స్ తన మిత్రులతో జరిపిన సంభాషణ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సంభాషణలో భాగంగా బిల్ గేట్స్ ఇలా అన్నారు. ”ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయితే కష్టాలు తప్పవు. ముఖ్యంగా అమెరికాలో ఫ్యామిలీ ప్లానింగ్, అంతర్జాతీయ స్థాయిలో గేట్స్ ఫౌండేషన్ చేపట్టే ఆరోగ్య సేవా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుంది. కానీ నేను మాత్రం ఎవరు గెలిచినా వారితో కలిసి పనిచేస్తాను. ఎవరైతే పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, వైద్య రంగం అభివృద్ధి కోసం అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పాటుపడతారో వారు గెలవాలని కోరుకుంటాను. నేను చాలా సంవత్సరాలుగా చాలామంది రాజకీయ నాయకులతో కలిసి పనిచేశాను. కానీ ఈ సారి అమెరికా ఎన్నికలు కీలకంగా మారాయి. ముఖ్యంగా అమెరికన్లకూ, ప్రపంచంలోని నిస్సహాయులకు ఈ ప్రెసిడెంట్ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.” అని చెప్పారు.

జూలై 2024 లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు.. బిల్ గేట్స్ ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. అమెరికా దేశానికి నాయకత్వం వహించడానికి ప్రస్తుతం ఏఐ లాగా ఆలోచించే యువ ఆలోచనలు కలిగినవారి అవసరముందని చెప్పారు.

Also Read:  బుక్ ఫెయిర్‌లో కరువైన పుస్తక ప్రియులు.. అమ్ముడుపోయిన 35 పుస్తకాలు, 800 బిర్యానీలు!

కమలా హ్యారిస్ వయసు ప్రస్తుతం 60 ఏళ్లు. ఆమె ప్రత్యర్థిగా 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనే అతి వృద్ధ అభ్యర్థి రికార్డ్ సృష్టించారు. బిల్ గేట్స్‌తోపాటు ఆయన మాజీ భార్య మెలిండా గేట్స్ కూడా కమలా హ్యారిస్ కు మద్దతు తెలిపారు. ఇప్పటివరకు ఫోర్బ్ పత్రిక ప్రకారం.. 81 మంది అమెరికా బిలియనీర్లు కమలా హ్యరిస్ వైపు నిలబడి ఉన్నారు. కానీ ట్రంప్ కు మద్దతుగా ప్రపంచలోని అతి సంపన్నులలో ఒకడు ఎలన్ మస్క్ ఉన్నాడు. ఎలన్ మస్క్ ఇప్పటివరకు ట్రంప్ ప్రచారం కోసం 7.5 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని సమాచారం. దీంతో పాటు ఎన్నికల రోజు వరకు ప్రచారంలో భాగంగా తన పిటీషన్ కు సైన్ చేసిన వారిలో ప్రతిరోజు ఒకరికి ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఎలన్ మస్క్ బహిరంగంగా ట్రంప్ నకు సపోర్ట్ చేయడం ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×