BigTV English

KH234 Movie : హీరోయిన్ కి 12 కోట్లు ఫిక్స్. ఇద్దరిలో ఈ ఆఫర్ ఎవరికో.?

KH234 Movie : హీరోయిన్ కి 12 కోట్లు ఫిక్స్. ఇద్దరిలో ఈ ఆఫర్ ఎవరికో.?

KH234 Movie : తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్.. విక్రమ్ మూవీ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. డాన్స్ దగ్గర నుంచి అభినయం వరకు ఎంతో పర్ఫెక్ట్ గా చేస్తాడు అని పేరు పొందిన హీరో కమల్. పేరుకు తమిళ్ యాక్టర్ అయినా తెలుగులో కూడా అతను చాలా సుపరిచితుడే. మొదటినుంచి కమల్ హాసన్ కు సంబంధించిన మూవీ వస్తుంది అంటే చాలు అందులో ప్రతి క్యారెక్టర్ గురించి ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. తాజాగా కమల్ హాసన్ మరో కొత్త సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది.


కమల్ హాసన్ కెరియర్ లోనే విలక్షణమైన చిత్రంగా నిలిచిన మూవీ నాయకుడు. 1987 లో వచ్చిన నాయకుడు మూవీ తో కమల్ తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ మూవీ డైరెక్టర్ మణిరత్నం. రీసెంట్ గా మణిరత్నం తీసిన పోనియన్ సెల్వన్ రెండు సిరీస్ లు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. సుమారు 36 సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి మళ్ళీ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో చిత్రం రాబోతోంది. ఈ ఎవర్ గ్రీన్ హిట్ జోడి తిరిగి ఈసారి ఎటువంటి వండర్స్ క్రియేట్ చేస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అంతకంటే ఆసక్తిగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతుంది. ఈ మూవీలో హీరోయిన్గా ముఖ్యంగా ఇద్దరు భామల పేరు వినిపిస్తోంది. పోనియన్ సెల్వన్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన త్రిష, లేడీ సూపర్ స్టార్ గా కెరియర్ లో దూసుకుపోతున్న నయనతార.. ఈ ఇద్దరిలో ఒకరు ఈ సినిమాలో కమల్ సరసన హీరోయిన్గా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఇద్దరు భామల లో ఆఫర్ ఎవరికి దక్కుతుందో తెలియదు. మణిరత్నంతో లేటెస్ట్ గా మూవీ చేసిన త్రిష కు ఛాన్స్ ఎక్కువ అన్న వాదన ఒకపక్క వినిపిస్తుంటే.. నయనతార బాగా సెట్ అవుతుంది అన్న మాట మరోపక్క వినిపిస్తుంది.


హీరోయిన్ ఎవరన్న విషయం తీసి పక్కన పెడితే మొత్తానికి ఇది కమల్ హాసన్ 234 మూవీ అవుతుంది. KH234 లో హీరోయిన్ ఎవరైనా సరే రెమ్యూనరేషన్ మాత్రం ఫిక్స్ చేయడం జరిగింది. ఇంతకీ రెమ్యూనరేషన్ ఎంత అనుకుంటున్నారు.. 12 కోట్లు.. అవునండి హీరోయిన్ ఎవరైనా అక్షరాలా పారితోషకం 12 కోట్లు అని మేకర్స్ ఫైనల్ చేసేసారు. హీరోయిన్ త్రిష అయినా..నయనతార అయినా..లేక మరొకరు ఎవరైనా.. ఇచ్చే రెమ్యూనరేషన్ మాత్రం 12 కోట్లు అనేది కన్ఫర్మ్ అయిపోయింది.

ప్రస్తుతం హీరోయిన్లలో టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న బ్యూటీ నయనతార. మరి ముఖ్యంగా మొన్న బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి సినిమాకే ఏకంగా 10 కోట్లు అందుకుంది. అది చాలదన్నట్టు బాలీవుడ్ లో మరొక సినిమాకి ఛాన్స్ దక్కించుకున్నట్లు.. అందుకుగాను రెమ్యూనరేషన్ 12 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అందుకే నయనతార రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా రెమ్యూనరేషన్ ని ముందుగానే ఫిక్స్ చేసేసారు అని అందరూ భావిస్తున్నారు. నయనతార కు సౌత్ లోనే కాక ప్రస్తుతం నార్త్ లో కూడా క్రేజ్ పెరగడమే దీనికి కారణం.

ఇక త్రిష విషయానికి వస్తే హిందీలో అడపాదడపా కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ నార్త్ లో పెద్ద క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 తమిళ్లో దంచి కొట్టిన నార్త్ లో నిరాశపరిచింది కదా.. అందుకే అక్కడ పెద్దగా డిమాండ్ సంపాదించలేకపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం కమల్ మణిరత్నం చేస్తున్న మూవీ లో త్రిషకి ఆఫర్ వచ్చిందా..ఇక ఆమె పంట పండినట్లే. ఈ ఆఫర్ దక్కించుకోగలిగితే సౌత్ లో ఇప్పటివరకు అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్గా కూడా కొత్త రికార్డు త్రిష ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కానీ ఛాన్స్ నయనతారకే ఎక్కువగా ఉంది అని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి ఈ ఆఫర్ ఎవరు చేజిక్కించుకుంటారో..!

Related News

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Big Stories

×