Basil Joseph OTT movies : ‘బాసిల్ జోసెఫ్’ ఈ పేరు ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలోనే కాకుండా, బయట కూడా మార్మోగుతోంది. రీసెంట్ గా వచ్చిన ఈ హీరో సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ హీరో నటన కూడా నేచురల్ గానే ఉంటుంది. ఈ యంగ్ హీరో నుంచి మూవీ వస్తుందంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఈ హీరో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మీరు గనక ఈ హీరో అభిమానులు అయితే తప్పకుండా చూడాల్సిన టాప్ ఫైవ్ మూవీస్ ఇవే
‘నునక్కుజి’ (Nunakkuzhi)
దృశ్యం సినిమా డైరెక్టర్ జీతు జోసెఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇందులో హీరో లాప్ టాప్ ను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. దాని తిరిగి తెచ్చే క్రమంలో చాలా దూరం వెళ్తాడు హీరో. ఈ మూవీ కూడా కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. జి ఫైవ్ (Zee 5) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
‘జయ జయ జయ జయహే’ (Jaya Jaya Jaya Jaya Hey)
విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ నటించారు. కొత్తగా పెళ్లయిన భర్త, భార్యతో పడే కష్టాలతో ఈ మూవీ నడుస్తుంది. ఈ మూవీ ప్రేక్షకులను మాత్రం కడుపుబ్బ నవ్విస్తుంది. ఇందులో బాసిల్ జోసెఫ్ నటన హైలెట్ గా నిలుస్తుంది. చివరి వరకు ఈ మూవీ సరదాగా సాగిపోతుంది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘కడిన కడోరమి అందకదహం’ (Kadina Kadoramee Andakadaham)
కరోనా మహమ్మారి సమయంలో ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఇందులో బాసిల్ జోసెఫ్ గల్ఫ్ కు వెళ్లకుండా, సొంత వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. ఆ సమయంలో అతడు చేసే వ్యాపారం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఈ మూవీని దర్శకుడు ముహాషిన్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో ఇంద్రాన్స్ జాఫర్, శ్రీజ రవి నటించారు. ఈ మూవీ సోనీ లివ్ (Sony Liv) లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘సూక్ష్మ దర్శిని’ (Sookshmadarshini)
రీసెంట్ గా రిలీజ్ అయినయి మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాన్యుయేల్ పాత్రలో బాసిల్ జోసెఫ్ ఒదిగిపోయారు. ఇందులో నజ్రియా నజీమ్ తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. 2024 లో వచ్చిన థ్రిల్లర్ సినిమాలలో ఇది కూడా ఒక బెస్ట్ థ్రిల్లర్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ మూవీ జియో హాట్ స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘అమ్మినిపిల్ల’ (Amminippilla)
బాసిల్ జోసెఫ్ న్యాయవాది పాత్ర పోషించిన మూవీ అమ్మిని పిల్ల. ఇందులో ఆసిఫ్ అలీ కూడా డిఫెన్స్ న్యాయవాదిగా నటించాడు. ఇందులోని పాటలు ఇప్పటికీ కుర్ర కారుని హోరెత్తిస్తాయి. ఈ మూవీ సన్ ఎన్ ఎక్స్ టి (Sun NXT) లో స్ట్రీమింగ్ అవుతోంది.