Malavika Mohanan: ఈరోజుల్లో సినిమాల్లో కలిసి నటిస్తున్న హీరో, హీరోయిన్ల మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఒకప్పుడు ఈ ఏజ్ గ్యాప్‌ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే వారు కాదు.. కానీ ఈమధ్య కాలంలో ఇదే విషయంపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. హీరో, హీరోయిన్‌కు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌ను హైలెట్ చేస్తూ వారిపై ట్రోల్స్ చేస్తున్నారు కొందరు ప్రేక్షకులు. గత కొన్నేళ్లలో భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలపై ఈ విషయంపైనే ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఆ ట్రోలింగ్ లిస్ట్‌లోకి హాట్ బ్యూటీ మాళవికా మోహనన్ కూడా యాడ్ అయ్యింది. 65 ఏళ్ల నటుడితో కలిసి మాళవికా మోహనన్ సినిమా చేస్తుందని తనపై నెగిటివ్ కామెంట్స్ రాగా.. అలా కామెంట్స్ చేసినవారికి ఇచ్చిపడేసింది ఈ భామ.
సీరియస్ రిప్లై
ప్రస్తుతం ప్రతీ భాషలో స్టార్ హీరోలుగా వెలిగిపోతున్న వారందరి వయసు దాదాపు 50 ఏళ్ల పైనే ఉంది. కానీ యంగ్ హీరోయిన్లకు మాత్రం 35 లోపే వయసు ఉంటుంది. ఇక ఏజ్ గ్యాప్‌తో సంబంధం లేకుండా ఆ 60 ఏళ్ల స్టార్లు.. ఈ 30 ఏళ్ల హీరోయిన్స్‌తో జోడీకడుతున్నారు. అంతే కాకుండా వారితో కలిసి డ్యాన్స్ స్టెప్పులు కూడా వేస్తున్నారు. అలా ప్రేక్షకులకు ఈ హీరో, హీరోయిన్ల జోడీలపై నెగిటివిటీ ఏర్పడింది, నెగిటివ్ కామెంట్స్ పెరిగాయి. తాజాగా మాళవికా మోహనన్.. మోహన్ లాల్‌కు జోడీగా ఒక సినిమా చేస్తోంది. ‘హృదయపూర్వం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ట్రోల్ చేయగా.. దానికి గట్టి రిప్లై ఇచ్చింది మాళవికా.
అలా చేయడం ఆపండి
‘‘65 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల అమ్మాయి ప్రేమించే వ్యక్తిగా నటిస్తున్నాడు. అసలు ఈ సీనియర్ హీరోలు తమ వయసుకు తగని పాత్రలు చేయడానికి ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తారో..’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. అది మాళవికా మోహనన్ కంటపడింది. దానికి తను సైలెంట్ అయిపోకుండా రివర్స్ రిప్లై ఇచ్చింది. ‘‘మేమిద్దరం ప్రేమికులం అని ఎవరు చెప్పారు.? సగం సగం తెలుసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జనాలను జడ్జి చేయడం ఆపేయండి’’ అని ఫైర్ అయ్యింది మాళవికా మోహనన్ (Malavika Mohanan). దీంతో మాళవికా మోహనన్ ఇచ్చిన ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది ఫ్యాన్స్ తన కామెంట్‌కు సపోర్ట్‌గా ముందుకొస్తున్నారు.
Also Read: ఇప్పుడు నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను.. తమన్నా సంతోషానికి కారణమేంటో.?
సంతోషంగా ఉంది
చాలావరకు ఏజ్ గ్యాప్ ఉన్న నటీనటులు ప్రేమికులుగానే కనిపిస్తున్నా కొందరు దర్శకులు మాత్రం వారిని అలా చూపించడం లేదు. అసలు హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ లాంటిది ఏమీ పెట్టకుండా ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చే కథలను రాసుకుంటున్నారు. దీంతో చాలావరకు సీనియర్ హీరోలు సైతం తమ ఏజ్‌కు తగిన పాత్రల్లోనే కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ‘హృదయపూర్వం’ (Hridayapoorvam) విషయానికొస్తే.. ముందుగా ఈ సినిమాలో తను మోహన్ లాల్ (Mohanlal)తో కలిసి నటిస్తుందని మాళవికానే రివీల్ చేసింది. అంతే కాకుండా అలాంటి సీనియర్ యాక్టర్‌తో నటిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. దీంతో పాటు తను ‘రాజా సాబ్’తో కూడా బిజీగా ఉంది.