Khushi Kapoor: సినీ పరిశ్రమలో వారసుడిగా, వారసురాలిగా అడుగుపెట్టాలంటే దానికి తగిన పరిణామాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ముందుగా ఒక నెపో కిడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే వారిపై చాలావరకు ట్రోల్సే ఎక్కువగా ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని నిలబడితేనే వారికి ప్రేక్షకుల నుండి అభిమానం లభించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం శ్రీదేవి వారసురాలు ఖుషి కపూర్ కూడా అదే ప్రయాత్నాల్లో ఉంది. మామూలుగా హీరోయిన్ అయిన తర్వాత నెపో కిడ్స్‌కు నెగిటివిటీ రావడం సహజం. కానీ ఖుషి మాత్రం అసలు తన డెబ్యూ చేయక ముందు నుండే నెగిటివిటీ ఎదుర్కుంటోంది. దానిపై తను ఓపెన్‌గా స్పందించింది. అంతే కాకుండా తన ఫేస్ సర్జరీలపై కూడా ఓపెన్ కామెంట్స్ చేసింది.
ఇంటర్వ్యూలో మరోసారి
చాలావరకు హీరోయిన్స్ ఫేస్ సర్జరీలు చేయించుకుంటారు అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అందులోనూ ముఖ్యంగా ముక్కుకు, పెదవులకు సర్జరీ చేయించుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. అలాగే ఖుషి కపూర్ కూడా తన మొహానికి సర్జరీ చేయించుకుందని ప్రేక్షకులకు తెలుసు. ఇప్పటికే తన సర్జరీల గురించి నెటిజన్లు నెగిటివ్‌గా మాట్లాడడం, దానికి తను రియాక్ట్ అవ్వడం చాలాసార్లు జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషి కపూర్ తన ఫేస్ సర్జరీ గురించి చెప్పడం మాత్రమే కాకుండా మరెన్నో విషయాలు పంచుకుంది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఖుషి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్లాస్టిక్ అంటారు
‘‘ఫేస్ సర్జరీ చేయించుకోవడం పెద్ద విషయం అని నేను అనుకోను. వారు నన్ను ప్లాస్టిక్ అనడం నేను వింటూనే ఉంటాను. ఒకరిని ప్లాస్టిక్ అని పిలవడం అతిపెద్ద అవమానం అని జనాలు అనుకుంటూ ఉంటారు. నేను ఇండస్ట్రీలోకి రాకముందే నేనెలా ఉంటాను, నేను ఏంటి అనే విషయాలను ముందే ఊహించేసుకున్నారు ప్రేక్షకులు. అందులో చాలావరకు నెగిటివ్‌గానే ఉన్నాయి’’ అంటూ తనపై వచ్చి ట్రోల్స్ గురించి లైట్ తీసుకుంది ఖుషి కపూర్. ప్రస్తుతం ‘లవ్‌యాపా’ అనే మూవీతో డెబ్యూకు సిద్ధమయ్యింది ఖుషి కపూర్. ఈ సినిమా ఫిబ్రవరీ 7న విడుదలకు రెడీ అవ్వగా దీని ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది. ఇందులో తను అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్‌తో జోడీకట్టింది.
Also Read: ఆ సీనియర్ హీరో సినిమాలో మాళవికా మోహనన్.. జాక్‌పాట్ కొట్టేసిందిగా.!
యాక్టింగ్ రాదంటూ
‘లవ్‌యాపా’ (Loveyapa) కంటే ముందే ‘ది ఆర్చీస్’ అనే ఒక వెబ్ మూవీతో నటిగా ప్రేక్షకులను పలకరించింది ఖుషి కపూర్ (Khushi Kapoor). కానీ ఆ సినిమాలో ఖుషి యాక్టింగ్ చూడగానే ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ మొదలుపెట్టారు. తనకంటే తన అక్క జాన్వీనే బెటర్ అని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. చాలావరకు తనపై వచ్చే నెగిటివిటీకి సీరియస్‌గా స్పందించకపోవడం ఖుషి కపూర్ లక్షణం. అందుకే అప్పుడప్పుడు తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌కు కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతూ ముందుకెళ్తుంది. చాలాకాలం క్రితం తనకు ఫేస్ సర్జరీ జరిగిన విషయాన్ని కూడా తానే స్వయంగా ఒప్పుకోని ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది ఖుషి.