Malavika Mohanan: మామూలుగా సీనియర్ హీరోలు సైతం యంగ్ హీరోయిన్స్‌తోనే జోడీకట్టడానికి ఇష్టపడుతుంటారు. అలా ఎన్నో కాంబినేషన్స్ సూపర్ హిట్ కూడా అయ్యాయి. సీనియర్ హీరోల సరసన నటించిన తర్వాత బ్రేక్ అందుకున్న హీరోయిన్లు కూడా చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మాళవికా మోహనన్ కూడా యాడ్ అవ్వనుందని తెలుస్తోంది. మాళవికా హీరోయిన్‌గా పరిచయమయ్యి చాలాకాలమే అయ్యింది. తన సోషల్ మీడియా పోస్టులతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బాగానే పెంచుకుంది కానీ తన కెరీర్‌కు మాత్రం ఇంకా సరైన బ్రేక్ పడలేదు. అందుకే సీనియర్ హీరోలతో నటించే హీరోయిన్స్ లిస్ట్‌లో జాయిన్ అయ్యి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
అదే బ్రేక్
మలయాళ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన మాళవికా మోహనన్.. ముందుగా మలయాళ సినిమాతోనే తన కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో విడుదలయిన ‘పట్టం పోలే’తో హీరోయిన్‌గా మొదటిసారి ప్రేక్షకులను పలకరించింది. హీరోయిన్‌గా మారిన తర్వాత కూడా మాళవికాకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు రాలేదు. తను నటించిన సినిమాలు హిట్ అయినా కూడా తనను మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదు. అయినా కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ బాలీవుడ్‌లో సైతం అడుగుపెట్టింది మాళవికా. 2019లో రజినీకాంత్ హీరోగా నటించిన ‘పేటా’ మూవీలో నటించిన తర్వాత మాళవికా కెరీర్‌లో కాస్త జోరు పెరిగింది. అందుకే ఈసారి ఒక మలయాళ సీనియర్ హీరోతో నటించి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఆయన సరసన
ప్రస్తుతం తన డెబ్యూ మూవీ ‘రాజా సాబ్’తో బిజీగా ఉంది మాళవికా మోహనన్. ఈ సినిమా 2025లోనే విడుదలకు సిద్ధమయ్యింది. దీని రిలీజ్ తర్వాత మాళవికాకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇంతలోనే మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ సరసన నటించే జాక్‌పాట్ కొట్టేసిందట ఈ ముద్దుగుమ్మ. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ‘హృదయపూర్వం’ అనే మూవీలో మాళవికాకు హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుందని మాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సత్యన్ అంతిక్కడ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Also Read: అక్క ముగ్గురు అంటే.. చెల్లి ఇద్దరు అంటుందే.. శ్రీదేవి కూతుళ్లా.. మజాకానా
రెండు సినిమాలు
‘హృదయపూర్వం’ (Hridayapoorvam)లో మోహన్ లాల్ (Mohanlal), మాళవికా మోహనన్ (Malavika Mohanan)తో పాటు సంగీత, సిద్ధికీ, సంగీత్ ప్రతాప్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ మూవీ ఫిబ్రవరీ 10న సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం మాళవికా మోహనన్ చేతిలో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ప్రభాస్ హీరోగా మారుతీ తెరకెక్కిస్తున్న ‘రాజా సాబ్’ కూడా ఒకటి. తమిళ డబ్బింగ్ సినిమాలతోనే ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ. అలాంటిది ‘రాజా సాబ్’తో మొదటిసారి నేరుగా పలకరించడానికి సిద్ధమయ్యింది. దీంతో పాటు కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ 2’తో కూడా మాళవికా బిజీగా గడిపేస్తోంది. ఇప్పుడు మోహన్ లాల్‌తో ఛాన్స్ కొట్టేసింది కాబట్టి మాళవికా మోహనన్ కెరీర్‌లో మరింత జోష్ పెరగనుంది.