Ind vs Eng, 3rd T20I: టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మూడవ టి20 ఉంది. ఐదు టి20 ల సిరీస్ లో భాగంగా ఇవాళ మూడవ మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ అలాగే చెన్నై చపాక్ స్టేడియంలో గెలిచిన టీమిండియా… రాజ్ కోట్ వేదికగా జరిగి ఇవాల్టి t20 లో కూడా గెలవాలని… ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే రెండు జట్లు… రాజ్ కోట్ లోని ( Rajkot) నిరంజన్ స్టేడియానికి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడవ టి20 మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Also Read: Nitish Kumar Reddy Injury: SRH కి షాక్.. ఐపీఎల్ 2025 నుండి నితీష్ కుమార్ రెడ్డి ఔట్?
ఆరున్నర గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ మ్యాచ్ లోకి కూడా టాస్ ముందుగా నెగ్గితే… మొదట మరోసారి బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది టీమిండియా. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా… ఇందులో గెలిచి… సిరీస్ కైవసం చేసుకోవాలని ఎంతో ఆత్రుతగా చూస్తోంది. ఈ అటు ఇవాళ జరిగే మ్యాచ్లో గెలిచి మళ్ళీ గాడిలో పడాలని… ఇంగ్లీష్ ప్లేయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి రెండు టి20 మ్యాచ్ లో విఫలమైన ప్లేయర్లను పక్కన పెట్టే యోచన లో కూడా ఇంగ్లాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాల్టి మ్యాచ్లో… మహ్మద్ షమీ ( Mohammed Shami ) ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో తొలి గేమ్‌ను 43 పరుగులతో ఏడు వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుచుకుంది టీమిండియా. ఆ తర్వాత చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ను ఓడించింది భారత్. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ ( Tilak varma ) వీరవిహారంతో భారత్ రెండు వికెట్ల తేడాతో స్వల్ప విజయాన్ని అందుకుంది. దింతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. ఇండియా Vs ఇంగ్లండ్ 3వ T20I మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అలాగే DD స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 3వ T20I మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో ఈ మ్యాచ్ ఫ్రీ గానే చూడొచ్చు.
Also Read: ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. అందుబాటులోకి టికెట్స్.. ఎలా బుక్ చేసుకోవాలంటే ?
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, రమణదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్ (WK), బెన్ డకెట్, జోస్ బట్లర్ (c), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్