E-Paper
Advertisement

Samantha: ఆ దర్శకుల వల్లే ఇలా జరిగింది, అందుకే సినిమాలు చేయట్లేదు.. సమంత షాకింగ్ స్టేట్‌మెంట్

Samantha: ఆ దర్శకుల వల్లే ఇలా జరిగింది, అందుకే సినిమాలు చేయట్లేదు.. సమంత షాకింగ్ స్టేట్‌మెంట్
Advertisement

Samantha: ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి యూత్‌లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది సమంత. ఇక హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే ఎంచుకుంటూ ముందుకెళ్లింది. తనతో విడాకుల తర్వాత చాలావరకు సినిమాల్లో కనిపించడమే మానేసింది. దీంతో సమంతను వెండితెరపై మిస్ అవుతున్నారు తన ఫ్యాన్స్. అందుకే తను ఏ ఈవెంట్‌కు అటెండ్ అయినా మళ్లీ సినిమా ఎప్పుడూ అనే ప్రశ్నే ఎదురవుతోంది. తాజాగా ఆ ప్రశ్నకు డీటైల్డ్‌గా సమాధానమిచ్చింది సామ్. తన దర్శకుల వల్లే తను ఇలా మారిపోయానంటూ ఆసక్తికర సమాధానమిచ్చింది.

పూర్తిగా నమ్మాలి

Advertisement

మామూలుగా సినిమాల విషయంలో గ్యాప్ వస్తే ఏ యాక్టర్ అయినా మంచి కథ కోసం ఎదురుచూస్తున్నామనే చెప్తారు. సమంత కూడా చాలాకాలంగా అదే సమాధానం చెప్తూ వస్తోంది. తాజాగా మరోసారి అదే సమాధానం చెప్తూ దానికి వివరణ ఇచ్చింది. ‘‘నేను ఒక కథను 100 శాతం నమ్మకపోతే నేను కూడా 100 శాతం దానికోసం పనిచేయలేను. అందరికంటే ఎక్కువగా నేనే ఒక అద్భుతమైన సినిమా కథ కోసం ఎదురుచూస్తున్నాను. నన్ను నమ్మండి. నేను నా నిర్ణయాలతో నన్ను గానీ, మిమ్మల్ని గానీ డిసప్పాయింట్ చేయాలని అనుకోవడం లేదు. నేను పూర్తిగా ఒక కథను నమ్మేవరకు దానిని సైన్ చేయలేకపోతున్నాను’’ అని బయటపెట్టింది సమంత.

వాళ్ల వల్లే

Advertisement

‘‘ఫ్యామిలీ మ్యాన్‌తో నేను ముందు చేయనిది ఏదో చేశానని ఫీలయ్యాను. సిటాడెల్ హనీ బన్నీతో కూడా అంతే. ఇలాంటివి నేను ముందెప్పుడూ చేయలేదు. రక్త్ బ్రహ్మాండ్‌ మరింత ఛాలెంజింగ్‌గా ఉంటుంది. డైరెక్టర్స్ రాజ్, డీకే కలిసి నన్ను చెడగొట్టారు. కానీ అది మంచికే. నేను ఎక్కువ ఛాలెంజ్‌లను ఎదుర్కునేలా వాళ్లే నన్ను సిద్ధం చేశారు. నేను పనికి వెళ్తున్న ప్రతీరోజూ యాక్టర్‌గా తృప్తిగా ఫీలవుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది సమంత. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది సామ్. అందులో విలన్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల అదే దర్శకులతో కలిసి ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ చేసింది.

Also Read: ఏడు నిమిషాల పాత్ర.. జీవితాన్నే మార్చేసిందంటున్న తాప్సీ..

సిరీస్‌లతో బిజీ

ఇకపై తనను ఛాలెంజ్ చేయని రోల్స్‌ అస్సలు ఒప్పుకోనని తేల్చి చెప్పేసింది సమంత (Samantha). ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. మరోసారి రాజ్, డీకే దర్శకత్వంలో ‘రక్త్ బ్రహ్మాండ్’ (Rakht Brahmand) అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభం అయ్యిందనే విషయాన్ని తనే స్వయంగా ప్రకటించింది. ఇది కూడా తను మునుపటి వెబ్ సిరీస్‌లలాగా హిందీలోనే తెరకెక్కుతోంది. ఇక సామ్ చివరిగా తెలుగులో విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమాలో నటించగా.. తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ‘కాతువాకుల రెండు కాదల్’ అనే సినిమాలో కనిపించింది. ఆ రెండిటి తర్వాత మరో సినిమాలో కనిపించలేదు సామ్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×