Amitabh Bachchan: భారత క్రికెట్ జట్టు నాయకుడిగా, జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సారధిగా, స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించిన ఆటగాడిగా రోహిత్ శర్మ {Rohit Sharma} కి ఎంతో మంచి పేరు ఉంది. కానీ గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతూ వచ్చాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ దారుణంగా విపలమయ్యాడు.
Also Read: Martin Guptill: మార్టిన్ గప్టిల్ విధ్వంసం.. 42 బంతుల్లో 160 పరుగులు!
దీంతో రోహిత్ శర్మ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలా ఆడడం కంటే ఇక రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమం అని కూడా అన్నారు. కానీ చివరికి తనకు ఎంతో ఇష్టమైన వైట్ బాల్ ఫార్మాట్ లో ఎట్టకేలకు {Rohit Sharma} బ్యాట్ ఝలిపించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ వన్డేలో తనదైన శైలిలో రెచ్చిపోయిన రోహిత్.. కేవలం 76 బంతులలోనే సెంచరీ మార్క్ ని అందుకున్నాడు. మొత్తంగా 90 బంతులలో 119 పరుగులు చేశాడు.
దీంతో ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు రోహిత్ శర్మ {Rohit Sharma} ఫామ్ లోకి రావడం పట్ల అభిమానులు ఖుషి అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నారు. సుమారు 16 నెలల తర్వాత సెంచరీ చేయడంతో రోహిత్ శర్మ {Rohit Sharma} పై ఇప్పుడు అన్ని వైపుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ {Amitabh Bachchan} అమితాబ్ బచ్చన్.. రోహిత్ శర్మని ఆకాశానికెత్తాడు.
తన బ్లాగ్ లో {Amitabh Bachchan} భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇలా రాశాడు.. ” విమర్శకుల నోళ్లు ముగించాల్సింది ఇలాగే. మిమ్మల్ని విమర్శిస్తున్న వారిని ఎప్పుడైనా అంచనాలకు మించి రానించి సమాధానం చెప్పాలి. సరిగ్గా రోహిత్ శర్మ {Rohit Sharma} అదే చేశాడు. మనం నిలబడ్డ కాళ్లు, అవి తిరిగే నేల, అందుకోసం తిరిగిన దూరం, చివరికి వాటికి కావలసిన మసాజ్ చేస్తే.. ఇన్నేళ్లు ఏం మిస్సయ్యామో మనకు తెలుస్తుంది. అంచనాలకు మించి రాణించడమే విమర్శకుల నోళ్లు మోహించడానికి ఉన్న ఏకైక మార్గం” అన్నారు {Amitabh Bachchan} అమితాబ్.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఖరారు..రిలీజ్ ఎప్పుడంటే ?
ఇక రోహిత్ శర్మ {Rohit Sharma} కి ఇది 32వ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ రెండవ స్థానానికి చేరుకున్నాడు. ఇక మరోవైపు ఛాంపియన్ ట్రోఫీకి ముందు రోహిత్ శర్మ {Rohit Sharma} ఫామ్ లోకి రావడం పట్ల భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ {Former captain Mohammed Azharuddin} హర్షం వ్యక్తం చేశారు. రోహిత్ ఇదే జోరు కొనసాగిస్తే భారత్ కచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంటుందని అన్నారు. ఇలా రోహిత్ శర్మపై అన్ని వైపుల నుండి ప్రశంశల వర్షం కురుస్తుంది.
Amitabh Bachchan said – "The courageous beating given to the Britis in Cricket. Simply Incredible. The Best way to silence criticism is to perform beyond expectations and Rohit Sharma did just that". (On his Blog). pic.twitter.com/rsjVeCnJIH
— Tanuj Singh (@ImTanujSingh) February 11, 2025