Maha Kumbh Mela: మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాకు హాజరై పవిత్ర స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేశారు. ఇక కుంభమేళాలో నాలుగు రాజ స్నానాలు పూర్తయ్యాయి. ఐదో రాజ స్నానానికి సమయం వచ్చేసింది. కుంభమేళాలో తదుపరి రాజ స్నానం మాఘ పూర్ణిమ రోజున జరగబోతోంది. ఫిబ్రవరి 12 ఉదయం కుంభమేళాలో పుణ్య స్నానం చేస్తారు. ఈ రోజున కోట్లాది మంది భక్తులు స్నానాలు ఆచరించడానికి వస్తారని అంచనా వేస్తున్నారు.ఇందుకు దగ్గట్లుగా అధికారులు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. మాఘ పూర్ణిమ తర్వాత మరో రాజ స్నానాన్ని మహా శివరాత్రి నాడు చేస్తారు.
శివరాత్రితోనే కుంభమేళా పూర్తవుతుంది. మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాకు హాజరై పవిత్ర స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే కుంభమేళాలో నాలుగు రాజ స్నానాలు పూర్తయ్యాయి. భోగి, మకర సంక్రాంతి, పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాలుగు రాజ స్నానాలు చేశారు. మాఘ పూర్ణిమ రోజు స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవిగా భావిస్తారు. ఫిమాఘ పూర్ణిమ తర్వాత మరో రాజ స్నానాన్ని మహా శివరాత్రి నాడు చేస్తారు. శివరాత్రితోనే కుంభమేళా పూర్తవుతుంది.
ఈ నేపథ్యంలో దాదాపుగా 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వేలాది వాహనాలు, లక్షలాది మంది భక్తులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు చేయాలని దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులకు ట్రాఫిక్ సమస్య చికాకు పెడుతోంది. వాహనాలన్నీ నత్త నడకన కదులుతున్నాయి. కట్నీ నుంచి మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ బోర్డర్ వద్ద వేలాది వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీడియోలు తీసి ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. మహా కుంభమేళాకు వచ్చే ముందు ఇక్కడి ట్రాఫిక్ సమస్యలు తెలుసుకుని బయలుదేరండని సలహా ఇస్తున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ట్రాఫిక్ జామ్ అదేనని ఓ భక్తుడు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.
కుంభమేళాకు వెళ్లే దారిలో భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న భక్తులు తమ ఆవేదనను తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తాగేందుకు నీళ్లు లేక, తినేందుకు సరైన ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు. పిల్లలతో కుంభమేళాకు వచ్చి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నవారి పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. ఈ సమస్యలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ .. యోగి ఆదిత్యనాథ్ ను టార్గెట్ చేశారు. సామాన్య భక్తులు మనుషులు కారా అంటూ నిలదీశారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న ప్రజలను మానవత్వంతో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ జామ్ లేకుండా చేసేందుకు చేయాల్సిన పనులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. కుంభమేళాలోని ట్రాఫిక్ జామ్ అంశాన్ని ప్రస్తావిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భక్తులకు కొన్ని సూచనలు చేశారు. మరో 48 గంటల పాటు ఎవరూ కుంభమేళాకు వెళ్లకపోవడమే మంచిదని MP CM మోహన్ యాదవ్ సూచించారు.
Also Read: మోదీ అవినీతిపై అన్నాహజారే మౌనం ఎందుకు?.. శివసేన సెటైర్
శని, ఆదివారాలు సెలవులు కావడంతో కోట్లాది మంది దేశం నలుమూలల నుంచి కుంభమేళాకు బయలుదేరారు. పరిత్ర స్నానాలు చేయడానికి అనేక అవస్థలు పడ్డారు. తిరుగు ప్రయాణంలో మరిన్ని అవస్తలు పడుతున్నారు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రం కానున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి వచ్చిన 43 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పుణ్యస్నానాలు చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవలే కుంభమేళాకు హాజరయ్యారు. పవిత్ర స్నానాలు ఆచరించారు. పలు ఆలయాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు.
మహా కుంభమేళాలో భారీ ట్రాఫిక్
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ జామ్‌తో రద్దీ
100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు pic.twitter.com/wuIvo7mHNc
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2025