Kiara Advani.. ప్రస్తుత కాలంలో హీరోయిన్ల ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పాలి. ఒకప్పుడు త్వరగా పెళ్లి చేసుకొని, పిల్లల్ని కంటే అందం చెడిపోతుందని, అందుకే హీరోయిన్ గా అవకాశాలు రావని, చాలామంది వయసు మించిపోయినా, పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ అలా కాదు.. 30 సంవత్సరాలు దాటకముందే కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని, అన్ని ముచ్చట్లను తీర్చుకుంటున్నారు. అంతేకాదు తమ భవిష్యత్తుకి పునాదులు వేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పిల్లలకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇప్పుడు పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తూనే.. గర్భం దాల్చింది మొదలు బిడ్డ జన్మించి, వారికి రెండు సంవత్సరాలు వచ్చే వరకు వారికే సమయాన్ని కేటాయిస్తున్నారు. అలా ఇండస్ట్రీని కాస్త పక్కన పెడుతున్నారని చెప్పాలి. ఇక వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న వారిలో దీపికా పదుకునే (Deepika Padukone) తర్వాత కియారా అద్వానీ (Kiara Advani) కూడా ఒకరు అని చెప్పాలి.
Nani Court Movie: ఎప్పుడు అడగలేదు.. ఈ ఒక్కటి మిస్ చేయొద్దు.. ఇదే ఎన్నిసార్లు చెప్తావు నాని..!
రెండేళ్లు ఇండస్ట్రీకి దూరం కానున్న కియారా..
ఒకప్పుడు హిందీలో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తెలుగులో కూడా ప్రభాస్ (Prabhas)తో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్(RamCharan) తో ‘వినయ విధేయ రామ’, ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాలు చేసి ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. అటు కెరియర్ పీక్స్ లో ఉండగానే సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) తో ఏడడుగులు వేసిన కియారా.. గత కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులు కాబోతున్నాం అంటూ శుభవార్తను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కియారా అద్వానీ మరో రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉండనుందని సమాచారం. బాబూ లేదా పాప పుట్టిన తర్వాతే కొంత విశ్రాంతి తీసుకొని, పాపా లేదా బాబు ఆలన పాలన చూసుకున్న తర్వాతనే రీఎంట్రీ ఉంటుందంటూ ఆమె టీం చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. కొంతమంది నెటిజెన్స్ ఇది నిజమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
భర్త కంటే ఈమెకే ఎక్కువ పాపులారిటీ..
ఇకపోతే కియారా.. తన భర్త కంటే ఈమెకే ఎక్కువ పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కియారా చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు మినహాయిస్తే.. మిగతా సినిమాల నుంచి ఈమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే ప్రారంభం కావాల్సిన ‘డాన్ 3’ నుండి కూడా తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఇప్పుడు మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి మళ్లీ రెండేళ్ల వరకూ ఇండస్ట్రీకి దూరం కాబోతోందని సమాచారం. మొత్తానికైతే కీయారా అద్వానీ మరో రెండేళ్లు ఇండస్ట్రీలో కనిపించదని తెలిసి అభిమానులు పూర్తిస్థాయిలో హర్ట్ అవుతున్నారని చెప్పవచ్చు.