Minister Seethakka: మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్కతో బిగ్ టీవీతో ఇంటర్వ్యూ జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పడు నుండి తాను కష్టపడుతూ ఈ స్థాయికి వచ్చానని మంత్రి సీతక్క తెలిపారు. వ్యక్తిగతంగా అదృష్టం కంటే కష్టాన్నే నమ్ముతానని ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
గతం కంటే ట్రైబల్ ఏరియాల్లో మార్పులు వచ్చాయని సీతక్క అన్నారు. పేదలకు తన వంతు సాయం చేయాలన్నదే నా తపన అని, చిన్నప్పటి నుంచే సేవ చేయాలనే మక్కువ ఉందని తెలిపారు.
LAW PHD చేయడానికి ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్నా అని తెలిపారు. జ్ఞానం సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తా అని ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కంటే ప్రతీ మనిషికి జ్ఞానం ఎంతో అవసరం అని అన్నారు. ప్రతీ అమ్మాయి మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు.
సమాజంలో మహిళలను గౌరవించే సంస్కృతి పెరగాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రతీ తల్లి తన కుమారులను మంచి మార్గంలో నడిపించాలన్నదే నా కోరిక అని వెల్లడించారు. రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సమానత్వం కోసం సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.