Pushpa Item Song Leaked Pic : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో పుష్ప 2 ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వచ్చిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో దర్శకుడు సుకుమార్ , అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పాటలు, డైలాగ్స్, మేనరిజమ్స్ ఇవన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి. చాలామంది స్పోర్ట్స్ మెన్స్, పొలిటికల్ లీడర్స్ ఈ సినిమాలోని డైలాగ్స్ లు విపరీతంగా వాడేసేవాళ్ళు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ నవంబర్ 19 వరకు జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమాకి సంబంధించి ఇంకొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడానికి ఈ ప్రాజెక్టులో చేరుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు దీని గురించి అధికారక ప్రకటన రాలేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతుంది. యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఈ సినిమాలోని ఒక ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్ కి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది లీకైన పిక్ అంటూ సోషల్ మీడియాలో దీనిని వైరల్ చేశారు. వాస్తవానికి ఇది ఒక మార్ఫింగ్ ఫోటో. ఒక సాంగ్ లో స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటోకి అల్లు అర్జున్ శ్రీ లీల ఫేసును యాడ్ చేశారు. రీసెంట్ టెన్స్ లో క్రియేటివిటీ అనేది ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫోటో చూసినప్పుడు కూడా ఇది ఒరిజినల్ గా అనిపిస్తుంది. అని తీక్షణంగా చూసినప్పుడే ఇది ఫేక్ అని తెలుస్తుంది.
Also Read : Game changer teaser promo : టీజర్ గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారు
ఇప్పటికే పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకులు ఊహించిన స్థాయిని మించి క్లైమాక్స్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమా క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి భారీ ఫైట్స్ లాంటివి ఏమీ లేకుండా హీరో విలన్ కలిసి ఇద్దరు ఒకచోట నార్మల్ గా మాట్లాడుకుంటారు. ఈ క్లైమాక్స్ చాలామంది కూడా కొత్తగా అనిపించింది. క్లైమాక్స్ గురించి పూరి జగన్నాథ్ కూడా సుకుమార్ తో మాట్లాడుతూ క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం పుష్ప 2 క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ సినిమాలో ఒక జాతర సీక్వెన్స్ ఉంది అది అద్భుతంగా ఉండబోతుందని నిర్మాతలు కూడా తెలిపారు. దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా ఎంత సంచలనాన్ని సృష్టిస్తుందో డిసెంబర్ 5న తెలియనుంది.