Nani : టాలీవుడ్ ఇప్పుడు సరికొత్త కాంబినేషన్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన రెండో సినిమా ‘ప్యారడైజ్’ కోసం విలన్ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన విడుదల చేసిన ఫస్ట్ లుక్, గింప్ల్స్ ఈ సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న వార్త మాత్రం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో విలన్ పాత్ర కోసం శ్రీకాంత్ ఓదెల కన్ను ఇటీవల విడుదలైన ‘కిల్’తో మెప్పించిన రాఘవ్ జుయెల్‌పై పడిందట..
‘కిల్’ సినిమాలో రాఘవ్ పోషించిన ఫణి అనే క్రూరమైన ప్రతినాయకుడి పాత్ర ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసింది. తన విలక్షణమైన నటనతో, భయంకరమైన హావభావాలతో రాఘవ్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. కేవలం కామెడీ పాత్రలకే పరిమితమైన రాఘవ్.. ఒక్కసారిగా ఇలాంటి నెగటివ్ షేడ్‌లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే.. ఇప్పుడు అదే రాఘవ్‌ను తన ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్యారడైజ్’లో ప్రతినాయకుడిగా తీసుకోవాలని శ్రీకాంత్ భావిస్తున్నారనే వార్త నిజంగానే ఊహించని మలుపు.
ఆ విలన్ ను తీసుకుంటున్నారా ..
‘దసరా’ వంటి డీప్ రూటెడ్ కథతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల.. ‘ప్యారడైజ్’ను 1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో ఒక అణగారిన తెగ ఎదుర్కొనే కష్టాల చుట్టూ అల్లుతున్నాడు. ఈ కథకు ఒక బలమైన, అంతే స్థాయిలో క్రూరమైన విలన్ అవసరం. బహుశా ‘కిల్’లో రాఘవ్ చూపించిన నట విశ్వరూపం శ్రీకాంత్‌ను ఆకర్షించి ఉండవచ్చు.
ఒకవైపు న్యాచురల్ స్టార్ నాని.. తన సహజమైన నటనతో ఎలాంటి పాత్రకైనా జీవం పోయగలడు. మరోవైపు రాఘవ్ జుయెల్.. తనలోని భిన్నమైన కోణాన్ని రీసెంట్ గా ‘కిల్’తో ప్రపంచానికి చాటి చెప్పాడు. వీరిద్దరూ కలిసి ‘ప్యారడైజ్’లో ఢీకొంటే.. తెరపై ఎలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
కొత్త తరహా విలన్స్ …
ఒకవేళ ఈ వార్త నిజమైతే, నాని కెరీర్‌లో ఇది ఒక భిన్నమైన అనుభవం కానుంది. ఎందుకంటే, ఇప్పటివరకు ఆయన చాలా సినిమాల్లో బలమైన విలన్లతో తలపడినప్పటికీ.. రాఘవ్ జుయెల్ వంటి కొత్త తరహా విలన్‌తో ఆయన పోరాటం మరింత ఆసక్తికరంగా ఉండొచ్చు. ముఖ్యంగా ‘ప్యారడైజ్’లోని పీరియాడిక్ సెటప్.. ఈ ఇద్దరి పాత్రలను మరింత ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉంది.
అయితే, ఇది కేవలం ఊహాగానం మాత్రమేనా లేక నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ కానుందా అనేది వేచి చూడాలి. కానీ, ఒక విషయం మాత్రం నిజం.. శ్రీకాంత్ ఓదెల తన ‘ప్యారడైజ్’ కోసం చాలా జాగ్రత్తగా నటీనటులను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక బలమైన కథకు అంతే బలమైన నటీనటులు తోడైతే.. ‘ప్యారడైజ్’ నిజంగానే ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోతుంది.
మరి, రైలు పట్టాలపై మొదలైన ఈ వైరం.. సికింద్రాబాద్ వీధుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే..
Retro: రెట్రో సునామీ మొదలైంది.. విడుదల ముందే రికార్డులు.. సూర్య విశ్వరూపం..!