Hair growth: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, ఎండల కారణంగా చర్మంపై ఎంత ప్రభావం పడుతుందో జుట్టుపై అంతకన్నా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. వేడి కారణంగా జుట్టు త్వరగా చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా మందిలో ఇది హెయిర్ ఫాల్ సమస్యకు దారి తీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే జుట్టు విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో జుట్టు ఆరోగ్యంగా, పట్టులా మెరిసేలా ఉండాలంటే, తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఈ సీజన్‌లో లభించే కొన్ని పండ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించి, పొడిబారకుండా చేసి, సహజమైన మెరుపును పొందవచ్చని అంటున్నారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడే ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కివీ
కివీ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అరోగ్య నిపుణులు చెబుతున్నారు. కివీలో ఐరన్, జింక్, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన పోషణను అందించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. తరచుగా తీసుకునే ఆహారంలో దీన్ని చెర్చుకుంటే జుట్టు రాలడాన్ని తగ్గించి, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ
జుట్టును కుదుళ్ల నుంచి బలంగా చేసేందుకు దానిమ్మ పండ్లు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ జుట్టుకు కావాల్సిన పోషణ అందించడంలో తోడ్పడతాయని అంటున్నారు. ఇవి తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు సహకరిస్తాయట. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుకే తరచుగా తీసుకునే ఆహారంలో దానిమ్మను తప్పక చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
నారింజ
నారింజ పండ్లు కొలాజెన్ బూస్టర్‌గా పని చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
నారింజలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొలాజెన్ ఉత్పత్తిని పెంచి, బ్లడ్‌లో ఐరన్ లెవెల్స్ కూడా పెరిగేలా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి పెరగడం వల్ల జుట్టు కూడా వేగంగా పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు నారింజ పండ్లను తినడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
బెర్రీలు
జుట్టును సంరక్షించడంలో బెర్రీ పండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయట. ఇవి జుట్టు కుదుళ్ల నుంచి కాపాడేందుకు హెల్ప్ చేస్తాయట. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: మండుటెండలో గుండె జర భద్రం.. లేదంటే ప్రాణ నష్టం తప్పదు
లిచీ
లిచీ పండ్లలో విటమిన్-సి, బి-కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పొడిబారకుండా చేయడంలో సహాయపడతాయట. అంతేకాకుండా, సహజమైన మెరుపును అందించేందుకు కూడా తోడ్పడతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
బొప్పాయి
జుట్టు ఎదుగుదలకు బొప్పాయి ఎంతో హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలోని సహజ ఎంజైమ్‌లు తలలోని చుండ్రును తొలగిస్తాయట. బొప్పాయిలో ఉండే ఫోలిక్ యాసిడ్ తలకు రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు సహకరిస్తుందట. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.