Vijay Devarakonda: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్లో విజయ్ దేవరకొండ ఒకడు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో కొన్ని కొన్ని పాత్రలో నటించిన విజయ్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిపోయాడు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత విజయ్ వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శివ సినిమా ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఆ స్థాయి హిట్ అయింది అర్జున్ రెడ్డి సినిమా. సినిమా తర్వాత విజయ్ స్టార్ హీరో అయిపోయాడు. సందీప్ రెడ్డివంగా బ్రాండ్ డైరెక్టర్ అయిపోయాడు.
ఖచ్చితంగా అవి ఉండాల్సిందే
అర్జున్ రెడ్డి సినిమాను చాలా ఇంటెన్స్ గా తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి అని అప్పట్లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఆ కిస్ పోస్టర్ అనేది చాలా సంచలనాలకు దారి తీసింది. ఒక సినిమాలో ఎన్ని కిస్ సీన్స్ ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఆ సినిమాకి అది అవసరం అని కూడా చాలామందికి అనిపించింది. కానీ ప్రస్తుతం విజయ్ చేస్తున్న ప్రతి సినిమాలో కూడా అవే సీన్స్ ఉండటం ట్రోల్ కి గురి అవుతుంది. ప్రతి సినిమాలోని విజయ్ కిస్ సీన్స్ పెట్టడం అనేది అలవాటుగా మారిపోయింది అని ఆరోపణలు వస్తున్నాయి. కథకి అవసరం లేకపోయినా కూడా పెట్టడం అనవసరం. అసలు కొత్త హీరోయిన్స్ ని కిస్ చేయడానికి హీరో అయినట్లుంది అంటూ కొంతమంది మీమ్స్ కూడా వేస్తున్నారు.
కింగ్డమ్ ప్రోమో
గౌతమ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో మంచి అంచనాలను పెంచింది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ ప్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో విజయ్ కిస్ చేసిన సీన్ వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాత నాగ వంశీ ప్రతి ప్రెస్ మీట్ లో ఈ సినిమా గురించి ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడడం తప్పదు.
Also Read : Sree Vishnu : నువ్వు సారీ చెప్పడం ఏంటి బ్రో… సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్