BigTV English

KA Movie: తెలుగు వాళ్ళంటే అంతే.. సంతోషంలో ఉప్పొంగిపోతున్న కిరణ్..!

KA Movie: తెలుగు వాళ్ళంటే అంతే.. సంతోషంలో ఉప్పొంగిపోతున్న కిరణ్..!

KA Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) రాజావారు రాణిగారు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇండస్ట్రీకి రాకముందు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ హీరో ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన చిత్రం’ క ‘.. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ రోజు రోజుకి డిమాండ్ భారీగా పెరిగిపోయిందని చెప్పాలి.


మా ఆయన కోసమైనా సినిమా చూడండి..

విడుదలైన రెండు రోజుల్లోనే రూ.10.25 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు థియేటర్లు హౌస్ ఫుల్ తో రన్ అవడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే కిరణ్ అబ్బవరం ఇటీవల ఎమోషనల్ అయిన తీరు, ఈయనకు బాగా కలిసి వచ్చింది. ‘పాలు తాగే వయసులోనే తన తల్లి తనను వదిలేసి.. విదేశాలకు వెళ్లిపోయి, అక్కడ ఏం పని చేసిందో తెలియదు కానీ , తనను చదివించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని.. అయితే కొంతమంది తన ఎదుగుదలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, అసలు తాను చేసిన తప్పేంటో చెప్పాలి’ అంటూ ఒక సినిమా ఈవెంట్లో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చారు.. అంతేకాదు ఈయన భార్య ప్రముఖ హీరోయిన్ రహస్య ఘోరక్ కూడా తన భర్త కోసమైనా ఈ సినిమా చూడండి అంటూ వేడుకుంది.


సక్సెస్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం..

ఇక వీరి బాధను అర్థం చేసుకున్న తెలుగు ప్రేక్షకులు వీరిని నెత్తిన పెట్టుకున్నారని చెప్పవచ్చు. కలెక్షన్ల పరంగా అటు ఉంచితే ఏకంగా అభిమానుల డిమాండ్ మేరకు అధికంగా 186 స్క్రీన్ లలో ఈ సినిమాను ప్రదర్శించడానికి థియేటర్ ఓనర్లు కూడా సిద్ధం అయిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ని చిత్ర బృందం నిర్వహించగా.. ఈవెంట్ లో పాల్గొన్న కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..” ఇన్ని రోజులు నన్ను పక్కింటి అబ్బాయిలా ఉన్నాడనే వారు. కానీ ‘ క ‘ సినిమాతో ఇంట్లో అబ్బాయిని అయిపోయాను. ఇన్ని రోజులు ఇంట్లోని వ్యక్తుల్లా నేను తప్పులు చేస్తే నన్ను తిట్టారు. సరి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇంత మంచి చిత్రం ఇవ్వడంతో ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను సక్సెస్ సాధిస్తే వారంతా కూడా సక్సెస్ కొట్టినట్టుగా భావిస్తున్నారు. సాధారణంగా ఎవరికైనా సక్సెస్ వస్తే సక్సెస్ కొట్టాడు అంటారు.. కానీ నాకు సక్సెస్ వస్తే అన్నా మనం సక్సెస్ అయ్యామని అంటున్నారు ఇంతకంటే నాకేం కావాలి. తప్పు చేసినప్పుడు తిట్టారు. ఇప్పుడు ఎదుగుతుంటే భుజం తడుతున్నారు అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు కిరణ్ అబ్బవరం. ఇక ఈ విషయం విన్న నెటిజన్స్ తెలుగు వాళ్లంటే అంతే బ్రదర్.. ఒకసారి నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×