BigTV English

Kiran Abbavaram: పాముల మధ్యలో బ్రతుకుతున్నారు.. అక్కడ షూట్ చేసినన్ని రోజులు భయపడేవాళ్ళం

Kiran Abbavaram: పాముల మధ్యలో బ్రతుకుతున్నారు.. అక్కడ షూట్ చేసినన్ని రోజులు భయపడేవాళ్ళం

Kiran Abbavaram: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన చాలామంది నటులు హీరోలుగా నిలబడ్డారు. ప్రస్తుత కాలంలో నాని రవితేజ వంటి చాలామంది హీరోలు చాలామందికి ఇన్స్పిరేషన్ గా మారారు. ఇక రీసెంట్ టైమ్స్ లో కూడా చాలామంది యంగ్ హీరోస్ స్వయంగా పైకి వచ్చారు. వారిలో విజయ్ దేవరకొండ (Vijay DevaraKonda) , నిఖిల్ (Nikhil) , తేజ సజ్జ (Teja Sajja), విశ్వక్సేన్ (Vishwak Sen) వంటి ఎంతోమంది హీరోలు ఉన్నారు. అయితే అందరూ చాలా పద్ధతిగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఒక హిట్ సినిమా పడింది అంటే అవకాశాల వరుసగా వెతుక్కుంటూ వస్తాయి.


రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. తను హీరో అవ్వడానికంటే ముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించిన రాజా వారు రాణి గారు సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్ సాధించింది. ఆ తర్వాత కిరణ్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత చేసిన సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా అద్భుతమైన హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కేవలం నటించడమే కాకుండా తనలోని రైటర్ టాలెంట్ ని కూడా బయటికి తీసాడు కిరణ్.

ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా హిట్ అయిన తర్వాత చాలా మంది కిరణ్ అప్రోచ్ అయ్యారు. చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అడ్వాన్సులు వచ్చాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుసగా సినిమాలు చేశాడు కిరణ్. అయితే ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ అయిన సినిమా ఒకటి కూడా ఆయన కెరియర్లో లేదు. ఇక ప్రస్తుతం కిరణ్ క అనే ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. కిరణ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకులు మధ్యకు రానుంది.


అయితే ఈ సినిమా కోసం చాలా రిస్క్ చేశాడు కిరణ్. కర్ణాటకలోని ఓ గ్రామంలో ఈ సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ జరిపారు. అయితే ఆ గ్రామంలో విపరీతంగా పాములు ఉంటాయట. చాలామంది అక్కడ పాముల మధ్య బతుకుతున్నారు. అక్కడ షూటింగ్ చేసినప్పుడు కిరణ్ చాలా భయపడ్డాను అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలానే తను పడుకున్నప్పుడు తన పక్కనుంచి కూడా ఒకసారి పాము వెళ్ళింది అని తెలిపాడు. ఏదేమైనా కిరణ్ ఒక హిట్ సినిమా చూసి చాలా రోజులైంది ఈ సినిమా కోసం చేసిన రిస్క్, టైం వర్కౌట్ అయితే మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి కిరణ్ వచ్చేసినట్లే అని చెప్పాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×