BigTV English

Brahmamudi Serial Today October 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్:   కళ్యాణ్‌ కు సినిమా ఛాన్స్‌ – అనామికకు అపర్ణ వార్నింగ్‌   

Brahmamudi Serial Today October 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్:   కళ్యాణ్‌ కు సినిమా ఛాన్స్‌ – అనామికకు అపర్ణ వార్నింగ్‌   

Brahmamudi serial today Episode: ఇందిరాదేవి, అపర్ణ, కనకం  కలిసి రావడం చూసిన కావ్య .. లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు అమ్మలు కలిసి వచ్చారు. మళ్లీ ఏదైనా జగన్నాటకం మొదలుపెట్టారా? అని వెటకారంగా అడుగుతుంది. దీంతో ముగ్గురు కావ్య మీద సీరియస్‌ అవుతారు. మీ ఇద్దర్ని కలపడానికి మేం మంచి ఆలోచనతో వచ్చాం అని చెప్తారు. ఏమీ వద్దని ఇంత వరకు మీరు  చేసింది చాలని మీ దారిన మీరు వెళ్లండని  కావ్య చెప్తుంది.


కనకం కావ్యను తిడుతుంది. నువ్వు వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతామా ఏంటి? ఈ సమస్య మా నుంచి మొదలైంది కాబట్టి పరిష్కారం కూడా మేమే ఇవ్వాలని వచ్చాము అంటుంది అపర్ణ. ఇందిరాదేవి కూడా అవును మంచి పరిష్కారం కూడా కనిపెట్టాము అని చెప్తుంది. దీంతో కావ్య  రెండో నాటకానికి రంగం సిద్దం చేసుకుని వచ్చారన్నమాట అంటుంది. ఆ మాట కొస్తే జీవితం కూడా పెద్ద నాటకరంగమే.. ప్రతి పాత్ర ఆ దేవుడు ఆడించినట్టే ఆడాలి అంటుంది కనకం.

ఇవన్నీ కాదు కావ్య అంటూ అపర్ణ  ఏదో చెప్పబోతుంటే కావ్య ఇక నా బతుకు నేను బతుకుతాను  అంటుంది. దీంతో ముగ్గురు కలిసి కావ్యను కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. ఇంతలో అపర్ణ, కావ్యను మళ్లీ ఆఫీసుకు వెళ్లమని చెప్తుంది. నేను ఆఫీసుకు వెళ్లినా ఆయనతో రోజు గొడవ పడాల్సి వస్తుందని కావ్య చెప్తుంది. అయితే కంపెనీలో ఎంప్లాయిగా వెళ్తే వాడు గొడవపెట్టుకుంటాడు. అదే సీఈవోగా వెళితే అంటూ అపర్ణ చెప్పగానే.. కనకం ఎగ్జైటింగ్‌ గా ఫీలవుతుంది. అంత పెద్ద కంపెనీకి నా కూతురు సీఐడీగా పని చేస్తుందా? అంటుంది. దీంతో ఇందిరాదేవి కనకాన్ని తిట్టి అది సీఐడీ కాదు సీఈవో అంటుంది.


ఇంతలో కావ్య హలో కాన్సర్‌ కనకం. నువ్వెందుకు అంత ఓవర్‌ చేస్తున్నావు. ఈ విషయం మీరు పక్కకు వెళ్లి చర్చించుకున్నప్పుడే తెలుసు కదా?  అంటుంది. ఇంతలో అపర్ణ కనకం నువ్వుండు.. ఇంతకీ నువ్వేమంటావు కావ్య అని అడుగుతుంది. మీరు మంచి ఐడియా అనుకుంటున్నారు. కానీ ఇది కూడా బెడిసికొడుతుంది అనిపిస్తుంది అత్తయ్య అంటుంది కావ్య. సడెన్‌గా అనామిక ఎంట్రీ ఇస్తుంది. అందరూ షాక్‌ అవుతారు. అనామిక దగ్గరకు వచ్చి అపర్ణను మెచ్చుకుంటుంది. కోడలు అంటే మీకెంత ప్రేమ అంటూ అయినా కావ్య వేరే ఏదైనా కంపెనీలో పని చేయాలంటే నా పర్మిషన్‌ ఉండాలి అంటుంది అనామిక. బోడీ నీ పర్మిషన్‌ ఏందో అయినా నీ కింద పనిచేయాల్సిన ఖర్మ నా మనవరాలికేంటి? నీలాగా దిగజారిపోయి బతకాల్సిన అవసరం మా ఇంటి కోడలికి లేదు అంటుంది ఇందిరాదేవి.

అనామిక కోపంగా అలా అంటే ఎలా ఇప్పుడు కానీ కావ్య నా కంపెనీకి రాకుండా పోతే నేను నేరుగా వెళ్లి కోర్టులో కేసు పెడతా..? జైలుకు పంపిస్తా అంటుంది. కోర్టుకు వెళ్లి కేసు వేయడానికి కారణం కావాలి కదా? ఏముంది నీ దగ్గర అని అడుగుతుంది అపర్ణ. దీంతో నీ కోడలు సంతకం చేసిన అగ్రిమెంట్ ఉంది. మా కంపెనీకి రెండేళ్లు వర్క్‌ చేస్తానని రాసిన అగ్రిమెంట్‌ పేపర్‌ చూపిస్తాను కోర్టులో అంటుంది అనామిక. దీంతో అపర్ణ అగ్రిమెంట్‌ పేపర్‌ తీసుకుని మొత్తం చదివి చిన్నగా నవ్వుకుంటూ ఇది చూశా నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు అంటూ పక్కకు చెక్‌ తీసుకొచ్చి ఇది 50లక్షల చెక్ తీసుకో అని చెప్తుంది అపర్ణ.

రెండేళ్లలో మధ్యలో ఎప్పుడైనా జాబ్‌ చేయలేము అనుకుంటే మీ కంపెనీకి 25 లక్షలు ఇవ్వాలి. అగ్రిమెంట్‌ లో అదే ఉంది. కానీ నేను నీకు 50 లక్షలు ఇస్తున్నాను తీసుకో అంటుంది అపర్ణ. దీతో అనామిక షాక్‌ అవుతుంది. దీంతో కనకం నవ్వుతూ వెటకారంగా అనామికను ఇంగ్లీష్‌ కూడా రాదా? అంటూ మాట్లాడుతుంది.  నా కూతురుని నీ ఉచ్చులో బిగించే ముందు ఒకటికి రెండు సార్లు చదువుకోవాలి కదా? అనగానే.. ఇంకో  పిడుగు లాంటి వార్త నువ్వు ఇంటికి వెల్లే సరికి నీకు కోర్టు నుంచి నోటీసు వస్తుంది. నీ పెళ్లి జరిగే రోజు నా కొడుకు మీ అమ్మా నాన్నాలకు రెండు కోట్లు ఇచ్చాడు కదా? అవి వెంటనే తిరిగి ఇవ్వకపోతే నేను మిమ్మల్ని జైలుకు పంపిస్తాను గెట్‌ అవుట్‌.. అంటుంది అపర్ణ.

అనామిక అవమానంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనామిక వెళ్లిపోయాక చూశావా కావ్య నీ కాపురం.. నీ జీవితం చెడగొట్టాలని ఎంతమంద ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారో అని చెప్తూ.. నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలి. నా కొడుకును నువ్వే దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్తుంది అపర్ణ. ఇందిరాదేవి, కనకం కూడా కన్వీన్స్‌ చేస్తారు. దీంతో కావ్య ఆఫీసుకు వెళ్లడానికి ఒప్పుకుంటుంది.

రోడ్డు పక్కన ఆటో ఆపుకుని ఉన్న కళ్యాణ్‌ దగ్గరకు ఒక సినిమా ప్రొడ్యూసర్‌ వచ్చి  తన కారు ఆగిపోయిందని నాతో పాటు మా రైటర్‌ ఉన్నాడు. మేము ఫిల్మ్‌నగర్‌ వెళ్లడానికి వస్తావా? అని అడుగుతాడు. సరేనంటాడు కళ్యాణ్‌. కారులోంచి దిగి వస్తున్న రైటర్‌ ను కళ్యాణ్‌ గుర్తు పట్టి విష్‌ చేస్తాడు. నేను మీకు పెద్ద అభిమానిని సార్‌ అని చెప్తాడు. తర్వాత ఇద్దరిని ఆటో ఎక్కించుకుని వెళ్తుంటే వాళ్లిద్దరూ ఓ సాంగ్‌ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో కళ్యాణ్‌ తాను రాసిన సాంగ్ ను పాడతాడు. సాంగ్‌ కంప్లీట్‌ కాగానే ప్రోడ్యూసర్‌, రైటర్‌ కళ్యాణ్‌ను మెచ్చుకుంటారు. నా సినిమా పాట దొరికిందని కళ్యాణ్‌కు ప్రొడ్యూసర్‌ తన కార్డు ఇస్తాడు.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

×